రాముడుభీముడు చిత్రం కోసం పెండ్యాల గారు స్వరపరచిన ఒక మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముందిలే.. ఇపుడేముందిలే
ఏముందిలే.. ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము
ముందుందిలే నీ ముందుందిలే
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
ఆ .. ఆ .. ఓ .. ఓ ..ఆ....
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా.. కాదందునా
అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల
అనుకొందునా ..అనుకొందునా
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో.. ఈ కథ ఏమిటో
కనులేమిటో ఈ కథ ఏమిటో
శృతి మించి రాగాన
పడనున్నది.. పడుతున్నది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిసిందిలే తెలిసిందిలే
నెలరాజ నీ రూపు తెలిసిందిలే
2 comments:
యన్.టీ.ఆర్ గారి యాక్షనే కాదు, అందం కూడా యెవ్వర్ గ్రీన్..
మరే బాగా చెప్పారు శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.