సోమవారం, జూన్ 27, 2016

వేణు గానమ్ము వినిపించెనే...

సిరిసంపదలు చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సిరి సంపదలు (1963)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ 
గానం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి
 
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..

దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను

అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...


వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...


మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట


అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...


వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..


దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట

ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన

తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.