ఇంటిగుట్టు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఇంటిగుట్టు(1958)
సంగీతం : ఎం.ఎస్.ప్రకాష్
సాహిత్యం : మల్లాది రామకృష్ణశాస్త్రి
గాత్రం : ఏ.ఎం.రాజా
ఆడువారి మాటలు
రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు
మాపైన పన్నీటి జల్లులు
ఆడువారి మాటలు
రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు
మాపైన పన్నీటి జల్లులు
ఏమన్నా కాదంటారు
తామన్నదె రైటంటారు
వాధించి సాధించి
చేసేరు సాములు
ఏమన్నా కాదంటారు
తామన్నదె రైటంటారు
వాధించి సాధించి
చేసేరు సాములు
వయ్యారి భామలు
కోసేవన్ని కోతలు
వేసేవన్ని ఫోజులు
చేసేవన్ని డాబులు
ఈ ఆడు లేడీలు బాపురే
ఆడువారి మాటలు
రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు
మాపైన పన్నీటి జల్లులు
వీరీది వేషమైతే
వారీది మోసమైతే
వేషాలు మోసాలు
దాగేవి కావులే
వీరీది వేషమైతే
వారీది మోసమైతే
వేషాలు మోసాలు
దాగేవి కావులే దాగేవి కావులే
జోగు జోగు చూపులు
చూపుల్లోనే బ్రేకులు
జోగుల్లోనే షాకులు
ఈ ఆడు లేడీలు బాపురే
ఆడువారి మాటలు
రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు
మాపైన పన్నీటి జల్లులు
2 comments:
యెవ్వరైనా ఫుట్ టాప్ చేయకుండా ఉండలేని పాట..వన్ ఆఫ్ మై ఫేవరెట్స్..థాంక్యూ వేణూజీ.
థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. అప్పట్లో వెస్ట్రన్ రాక్ ఎన్ రోల్ స్టైల్ లో కంపోజ్ చేసిన ట్యూన్ కదండీ.. ఎలాంటి మూడ్ లో ఉన్నా చిన్న చిరునవ్వుతో ఫుట్ టాప్ చేయించే పాట ఇంక అన్నగారి అల్లరి చూస్తే హుషారు రాకుండా ఉంటుందా :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.