శనివారం, జూన్ 04, 2016

నీవు రావు నిదుర రాదు...

పూలరంగడు చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు గారు స్వర పరచిన ఓ చక్కని విరహ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పూల రంగడు (1967)
సంగీతం : ఎస్ రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

ఆఆ...ఆఆఅ...ఆఆఆ...
నీవు రావు.. నిదుర రాదు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు

తారా జాబిలి ఒకటై సరస మాడే ఆరేయి
తారా జాబిలి ఒకటై సరస మాడే ఆరేయి
చింత చీకటి వొకటై చిన్నబోయె ఈ రేయి

నీవు రావు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు 
 
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆశలు మదిలో విరిసే దొసిట విరులై కురిసే
ఆలయాన చేరి చూడ ఆలయాన చేరి చూడ
స్వామి కాన రాడాయె నా స్వామి కాన రాడాయె

కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
కౌగిలిలో వొదిగి పోయి కలలు గనే వేళాయె
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదురు చూసి ఎదురు చూసి
కన్నుదోయి అలసిపోయె

నీవు రావు..
నీవు రావు నిదుర రాదు
నిలిచి పోయె ఈ రేయి
నీవు రావు నిదుర రాదు 

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.