శుక్రవారం, జూన్ 17, 2016

రేయి మించేనోయి రాజా...

శభాష్ రాముడు చిత్రంలోని ఒక హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శభాష్ రాముడు
రచన : సముద్రాల
సంగీతము : ఘంటసాల
గానం : సుశీల

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా


వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచె
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచె
స్వప్నాల లోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలోన దేవ గానాలు వింటూ
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా


చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చింతా వంతా నీకేలనోయి
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.