శనివారం, జూన్ 18, 2016

ప్రేయసీ మనోహరి...

వారసత్వం చిత్రం కోసం ఘంటసాల గారు స్వరపరచిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : వారసత్వం (1964)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

ప్రేయసీ మనోహరి
వరించి చేరవే
ప్రేయసీ మనోహరి

తీయని మనొరథం
నా తీయని మనొరథం
ఫలింప చేయవే ఏ..

ప్రేయసీ మనోహరి

వరించి చేరవే
ప్రేయసీ మనోహరి

దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరు వేళ
దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరు వేళ
తారకా సుధాకర తపించసాగెనే ఏ..

హాయిగా మనోహర
వరించి చేరుమా
హాయిగా మనోహర

మురిసింది కలువకాంత
చెలుని చేయి సోకినంత
మురిసింది కలువకాంత
చెలుని చేయి సోకినంత
రాగమే సరాగమై ప్రమోదమాయెనే ఏ..

హాయిగా మనోహర
వరించి చేరుమా
హాయిగా మనోహర

ఆఆహ్..ఆఅహహహ..

పెనవేసె మల్లె తీగె 
మనసులోన మమత రేగె 

పెనవేసె మల్లె తీగె 
మనసులోన మమత రేగె 
ఊహలో ఒయ్యారమూ
నా ఊహలో ఒయ్యారము 
ఉయ్యాలలూగెనే
 
ప్రేయసీ మనోహరి
వరించి చేరవే
ప్రేయసీ మనోహరి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.