గురువారం, జూన్ 16, 2016

చేయి చేయి కలుపరావె...

అప్పుచేసి పప్పుకూడు చిత్రం కోసం సాలూరి వారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ.ఎమ్.రాజా, పి.లీల

చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ

అహా చేయి చేయి

పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ

ఉహూ చేయి చేయి

మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ

అహా చేయి చేయి

వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ

అహా చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ

అహా చేయి చేయి 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.