మంగళవారం, జూన్ 21, 2016

ఒహో ఒహో నిన్నే కోరెగా...

ఇద్దరు మిత్రులు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల, సుశీల

ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల
ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహుకుహూ అని కోయిల
వసంత వేళల పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా
ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల

అదా కోరికా వయ్యారి కోయిల
జగాలే నీ చూపులో జలదిరించెలే
అదా కోరికా వయ్యారి కోయిల
జగాలే నీ చూపులో జలదిరించెలే
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే

ఒహో ఒహో నిన్నే కోరెగా
కుహు కుహూ అని కోయిల

ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలూగే నా మది చిటారుకొమ్మల
నివాళి అందుకో ఈవేళ పండుగ
సదా సుధా తరంగాల తేలిపోదమా

ఒహో ఒహో నిన్నే కోరితి
కుహు కుహూ అని పాడితి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.