బుధవారం, జూన్ 08, 2016

కిలకిల నవ్వులు చిలికిన...

చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ
కరగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల


రమ్మని మురళీరవమ్ములు పిలిచె
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
అణువణువున బృందావని తోచె
తళతళలాడే తరగలపైన
అందీ అందని అందాలు మెరిసె


కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ

నీవున్న వేరే సింగారములేల
నీవున్న వేరే సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా

మమతలు దూసి మాలలు చేసి
గళమున నిలిపిన కళ్యాణి నీవే

కరగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల


నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే
సాగెను జీవనరాగాల నావ


కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికినా

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.