శనివారం, జూన్ 11, 2016

ముందరున్న చిన్నదాని...

కాలంమారింది చిత్రం కోసం సాలూరి వారు స్వరపరచిన ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కాలం మారింది (1972)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే
ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే

పొందుగోరు చిన్నవాని తొందరేమో
మూడుముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే

పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో
పైట కొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేనని 
నీలోని పొంగులు నావేనని
చెమరించు నీ మేను తెలిపెలే
ఆ...ఆ..ఓ..ఓ...

పొందుగొరు చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడ
మరచిపోయే... తోచదాయే

కొంటే చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నెమనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరియైన సమయం రాలేదులే
సరియైన సమయం రాలేదులే
మనువైన తొలిరేయి మనదిలే
ఓ..ఓ..ఆ..ఆ...

ముందరున్న చిన్నదాని అందమేమో
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే... దాగిపోయే

ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరు ఈ విరహాలు
కాదన్న వారు అవునన్ననాడు
కౌగిళ్ళ కరిగేది నిజములే

ముందరున్న చిన్నదాని అందమేమో...
చందమామ సిగ్గు చెంది
సాగిపోయే ...దాగిపోయే
పొందుగోరు చిన్నవాని తొందరేమో...
మూడుముళ్ళ మాటకూడ
మరచిపోయే... తోచదాయే


3 comments:

యెందుకో మరి ఈ పాట వింటే నండూరి యెంకి ఙాపక మొస్తుంది..

థంక్స్ వనజ గారు.
థాంక్స్ శాంతి గారు నిజమేనండీ భాష, బాణీ రెండూ పల్లె పరిమళాలను పట్టివ్వడం వలన అయుండచ్చు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.