ఆదివారం, జూన్ 12, 2016

వస్తా వెళ్ళొస్తా...

సిసింద్రీ చిట్టిబాబు చిత్రం కోసం సినారె గారు రాసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సిసింద్రీ చిట్టిబాబు (1971)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం :  ఘంటసాల, సుశీల

వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా 
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మళ్ళి మళ్ళి వస్తా..ఆ..ఆ..
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళి వస్తా

 
కనులైన కలవందే మనసైనా తెలవందే
ముద్దైనా ఇవ్వందే మోజైనా తీరందే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అయితే నేవెళ్ళొస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా..వస్తా..
మళ్ళి ఎప్పుడైనా వస్తా
 
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లగ్నం చూసుకు వస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా

చినదాని చెక్కిలిపై చిటికైనా వేయందే
కళ్ళల్లో కళ్ళుంచి కథలైనా చెప్పందే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అలా జారుకొంటావే ఠలాయించిపోతావే
అయితే నేవెళ్ళొస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా..
వస్తా..ఎప్పుడన్నా వస్తా

ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఎప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లగ్గం చూసుకు వస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళొస్తా
వస్తా మళ్ళి వస్తా

2 comments:

ఆ పాటలో భావం..కింద పిక్ లో ఉన్న అమ్మాయి కళ్ళలో భలే కనిపిస్తోందండీ..

థాంక్స్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.