ఆరాధన చిత్రం కోసం సాలూరి వారు స్వరపరచిన ఒక హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల
వెన్నెల లోనీ వికాసమే
వెలిగించెద నీ కనులా
వెన్నెల లోనీ వికాసమే
వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా
నిదురించుము ఈ రేయి
నిదురించుము ఈ రేయి
వెన్నెల లోనీ వికాసమే
వెలిగించెద నీ కనులా
వాడని పూవుల తావితో
కదలాడే సుందర వసంతమీ కాలము
కదలాడే సుందర వసంతమీ కాలము
చెలి జోలగ పాడే వినోద రాగాలలో
చెలి జోలగ పాడే వినోద రాగాలలో
తేలెడి కల సుఖాలలో
నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెల లోనీ వికాసమే
వెలిగించెద నీ కనులా
భానుని వీడని చాయగా
నీ భావము లోనే చరింతునోయీ సఖ
నీ భావములోనే చరింతునోయీ సఖ
నీ సేవలలోనే తరింతునోయీ సదా
నీ సేవలలోనే తరింతునోయీ సదా
నీ ఎదలోనే వసింతులే
నిదురించుము ఈ రేయీ
నిదురించుము ఈ రేయీ
వెన్నెలలోనీ వికాసమే
వెలిగించెద నీ కనులా
వేదన మరచి ప్రశాంతిగా
నిదురించుము ఈ రేయి
నిదురించుము ఈ రేయి
నిదురించుము ఈ రేయి
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఈ రోజు ఫాదర్స్ డే సంధర్బంగా నాన్న చిత్రంలోని ఈ చక్కని పాటను కూడా తలుచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నాన్న (2011)
సంగీతం : జి.వి.ప్రకాష్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : బాలు, రాజేష్
లాలిజో హ లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలో ఒక వింతగా నీ గొంతే వింటుందీ
హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం హో..
ఏ చిలిపి నవ్వుల గమనం సుధా రాగం
ఇరువురి రెండు గుండెలు ఏకమయ్యెను సూటిగా
కవచము లేని వాడ్ని కాని కాచుట తోడుగా
ఒకే ఒక్క అశృవు చాలు తోడే కోరగా
లాలిజో హ లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ
భూమిలో ఒక వింతగా నీ గొంతే వింటుందీ
మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే
జల్లే ఆగే ఐతే ఏంటి కొమ్మే చల్లులే
ఎదిగీ ఎదిగీ పిల్లా అయిందే
పిల్లైనా ఇవ్వాళ్ళే తనే అమ్మలే
ఇది చాలు ఆనందం వేరేమిటే
ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే
తను కనుపాపలోన చూడగ లోకం ఓడెలే
ఒకే ఒక్క అశృవు చాలు తోడే కోరగా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.