సోమవారం, జూన్ 20, 2016

ఈ పగలు రేయిగా...

సిరిసంపదలు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : సిరి సంపదలు (1962)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, జానకి

ఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ ఆ... ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి... ఓ ఓ ఓ...

మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహా ఓహో అహా... ఆ...
మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే
మాట తెలియునని మానేవు
ఊఁ.

వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి... ఓ ఓ ఓ...

కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ... ఆఁ... ఓ ఓ ఓ...
కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు
చెంపలు పూచే కెంపులు
నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో...

వెండి వెన్నెల జాబిలి 
నిండు పున్నమి జాబిలి..

అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు
ఉహుహు..
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకద్దము చూపేను ఆహా...

వెండివెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి
ఆహహాహా... ఆహహాహా...
ఆహహాహా... ఆహహాహా...
ఊహుహూ...

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.