సోమవారం, జనవరి 05, 2015

తారంగం.. తారంగం...

విష్ణులీలల్లో సాగరమధన ఘట్టం, వామనావతార ఘట్టాలని చెరో చరణంలో పొదువుకుని చివరిగా అన్నదమ్ములు కలిసుండాలనీ చెప్పుడు మాటలు వినకూడదనీ చెబుతూ సాగే ఈ పాట చాలా బాగుంటుంది. బాలభారతం చిత్రంకోసం సాలురి వారి స్వరసారధ్యంలో సుశీలమ్మ గానం చేసిన సినారె వారి రచన ఇది, ఎంత బాగుంటుందో మీరే వినండి. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బాల భారతం(1972)
సంగీత : సాలూరు రాజేశ్వరరావు
రచన : సి నారాయణరెడ్డి
గాయకులు : పి సుశీల

తారంగం ! తారంగం ! తాండవకృష్ణా  తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !
తారంగం ! తారంగం ! తాండవకృష్ణా  తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !

 
దేవతలూ దానవులూ పాల సముద్రం తరిచారు
దేవతలూ దానవులూ పాల సముద్రం తరిచారు
అప్పుడు అమృతం పుట్టింది.. అందరికీ నూరూరింది
మాదే మాదే అమృతమని వాదులాడు సోదరుల గని
అప్పుడు నువ్వేం చేెశావు 
ఆడవేషం వేశావు
ఆ కులుకు ! ఆ తళుకు.. 

ఆ కిలకిల నవ్వుల బెళుకు !
ఇంకా నువ్వేం చేెశావు !

తగినవారికి సుధను పంచిపెట్టావు
పొగరు బోతులకేమో సున్నా చుట్టావు 
 
తారంగం ! తారంగం ! తాండవకృష్ణా  తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !

 
ఇంద్ర పదవినే చేపట్టితినని
ఎగిరి ఎగిరి పడె బలి
వాని గర్వముని అణచి వెయగా
వామనుడాయెను హరి
వడుగై వానిని చేరెను
మూడడుగుల నేలను కోరెను
అడ్డుపడిన ఆ శుక్రుని కంటిని
దర్భ పుల్లతో పొడిచెను ఆ కన్నే లొట్టగ చెసెను 
ఆ..!!! ఆ..ఇంతై - వటుడంతై
మరి ఎంతో ఎంతో పెరిగెను . . . పెరిగీ !
భువినొక్క అడుగుతో మూసెను
దివినొక్క అడుగుతో దాచెను
మూడవ అడుగు ఏదని బలినే పాతాళానికి తొక్కెను 
 
తారంగం ! తారంగం ! తాండవకృష్ణా  తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !

 
అన్నలారా విన్నారా ! చిన్న కృష్ణుని గాథలు !
అసూయలన్నవి లేకుంటే
బ్రతుకులు  కళకళ లాడునులే
చెప్పుడు మాటలు వినకుంటే
ఎప్పటికైనా శుభమౌలే
అన్నదమ్ములు కలిసుంటే
అందరికీ ఆనందం
ఆపై దేవుడు తోడుంటే
ఆనందం పరమానందం  
 
తారంగం ! తారంగం ! తాండవకృష్ణా  తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !
దైవం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !
ధర్మం నీవే తారంగం ! ధర్మం నీవే తారంగం !


1 comments:

బాల భారతం సినిమా ఇప్పటికి యెన్ని సార్లు చూశానో లెక్కే లేదు..బట్ యెప్పుడు టీవీ లో వొచ్చినా చానల్ మార్చ లేము..ఇందులోదే మానవుడే మహనీయుడు పాట వీలైతే వేయగలరా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.