వెన్నెల్లో బృందావనాన్ని చూడాలని ఓ చిన్నారి కోరిక... వెళ్ళినా కనులారా చూడలేని అసక్తత... ఉన్న చోటనే తన వేణుగానంతో ఆ చిన్నారికి బృందావనాన్ని చూపించాడో కళాకారుడు. కె.వి.మహదేవన్ గారి స్వర సారధ్యంలో బాలు సుశీలలు గానం చేసిన ఈ సిరివెన్నెల రచన వింటే మనసు పులకించి మనమూ బృందావనిని చేరుకోవడం ఖాయం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సిరివెన్నెల (1987)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే...
చందమామ రావే జాబిల్లి రావే
2 comments:
same song, pallawi:- in
"paapa kOsam",dEwika, BABY RANI;
hindi - nanhaa pharistaa_
If possible, give that song also - kusumaamba
చూపున్న కంటికి అంతా తేటతెల్లమే..మనసుకే కనులుంటే అంతా అందమే..ఆనందమే..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.