గురువారం, జనవరి 22, 2015

అమ్మంటే మెరిసే మేఘం..

ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలోని ఒక చక్కని అమ్మపాటను ఈరోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ 
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
అమ్మంటే మెరిసే మేఘం..మ్మ్..మ్మ్.మ్మ్
నాన్నంటే నీలాకాశం..మ్మ్..మ్మ్.మ్మ్
అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరోప్రాణం
నువ్వే మా తారాదీపం పూజా పుష్పం

ఓ..అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ 
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ

శోకంలో పుట్టింది శ్లోకంగా రామ కథా
శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా
బంధాలే భస్మాలు విధే కదా వింత కథా
మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మ కథా
బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైన బాధల్లో
కన్నీరై చల్లార్చే గతేలేని గాధల్లో

ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ 
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ

చింతల్లో సీమంతం శిలలోనే సంగీతం
శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం
ఒక బ్రహ్మని కన్నావు అమ్మకి అమ్మైనావు
శివవిష్నువులిద్దరినీ చీకటిలో కన్నావు..ఆ.ఆ.ఆ..ఆ
త్రిమూర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో
ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ 
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
 

2 comments:

ప్రకృతంటే అమ్మ అని చెప్పే ఈ పాట నాకు చాలా ఇష్టమండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.