మంగళవారం, జనవరి 06, 2015

ఓహో మోహనరూపా...

ఆ మోహన రూపుడిని గాంచినంతనే మురవని మనసు ఉంటుందా. మరి అంతటి చక్కనయ్య కన్నయ్య కేళీ కలాపాల కబురులు ఏమిటో ఈ పాటలో మీరే చూసి తెలుసుకోండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం(1966)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
రచన : శ్రీ శ్రీ
గానం : బి వసంత, ఘంటసాల, పి సుశీల

ఓహో మోహనరూపా 
కేళీ కలాపా కృష్ణా

ఓహో మోహనరూపా కేళీ కలాపా 
కృష్ణా నిను గని మురిసెను నా మనసే

ఓహో మోహనరూపా కేళీ కలాపా 
కృష్ణా నిను గని మురిసెను నా మనసే

ఓఓఓ...ఆఆఅ....
మధువులు చిందే మందహాసం
మరులూరించే వేణుగానం
మధువులు చిందే మందహాసం
మరులూరించే వేణుగానం
వినివిని పరవశనైతినిలే
వినివిని పరవశనైతినిలే
బిగిబిగి కౌగిట కరగితిలే

ఓహో మోహనరూపా కేళీ కలాపా 
కృష్ణా... నిను గని మురిసెను నా మనసే

ప్రణయారాధన వేళ బాలా
పతిపూజలు నీకేల బేలా
ప్రణయారాధన వేళ బాలా
పతిపూజలు నీకేల బేలా..ఆఆ..
వలపు చిలుకును నీ చూపులు నాపై
నిలుపవే శుభాంగీ నిలుపవే లతాంగీ

ఓహో మోహనరూపా కేళీ కలాపా కృష్ణా...
నిను గని మురిసెను నా మనసే

ఓఓఓ....ఆఆఆ....
మధుర సుధా రాగమే
మదిలో కదిలే తీయగా
ఓఓఓఓఓ....
మధుర సుధా రాగమే
మదిలో కదిలే తీయగా
శిఖిపింఛమౌళీ నన్నేలగా
తనువే ఊగే హాయిగా
ఆఆఅ...ఓఓఓ..మ్మ్మ్...

అహో లీలామానుషవేషధారీ మురారీ
తనివార నినుగాంచి ధన్యతనొందితి శౌరీ
ఓహో మోహనరూపా కేళీ కలాపా 
మోహనరూపా..మోహనరూపా..



1 comments:

ఈ పాట వింటే వెన్నెల్లో బృందావనమే కనుల ముందు కనిపిస్తుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.