మంగళవారం, జనవరి 27, 2015

ఈ వేళ నాలో...

మూగనోము చిత్రంలోని ఒక అందమైన పాట ఈరోజు తలచుకుందాం... ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు

 
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే

నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..

 
నీలోని ఆశలన్నీ నా కోసమే..
నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
 
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..
లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా
లాలలా... ఊ హూ హు.

2 comments:

ఇంత అందమైన చిన్న చిన్న మాటలతో హృద్యంగా ప్రేమని ఎక్స్ ప్రెస్ చెయ్యగల అవకాశం ఉండీ మన రైటర్స్ "రాయె రాయె నా రాకాసి" లాంటి పాటలెందుకు రాస్తున్నరో అర్ధం కాదు..

హ్మ్.. అభిరుచిలో మార్పు అని సరిపెట్టుకోడమేనండీ ఏం చేయగలం..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.