బుధవారం, జనవరి 21, 2015

తళతళా మిలమిలా...

అన్నపూర్ణ చిత్రం కోసం సుసర్ల దక్షిణామూర్తి గారి స్వర సారధ్యంలో సుశీల గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అన్నపూర్ణ (1960)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల

ఆ... ఆ... ఆ...
తళతళా... మిలమిలా ...
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా... ఆ...
ఎందువలన ఓ లలనా ఎందువలన ?
ఎందువలన ఓ లలనా ఎందువలన ??

తళతళా...ఆ.. మిలమిలా ...ఊ..ఊ..
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా... ఆ...
ఎందువలన ఓ లలనా ఎందువలన?
ఎందువలన ఓ లలనా ఎందువలన??

చిలకమ్మల కిలకిల.. చిగురాకుల కలకల..
చిలకమ్మల కిలకిల.. చిగురాకుల కలకల...
గాలి వీచి పూలు కురిసి కథలు తెలిపె కోయిలా..
తెలియరాని ఊహలలో తేలిపోవు వేళా
చిలిపిగా పావురాలు చూసి నవ్వెనేలా!

తళతళా... మిలమిలా ...
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా... ఆ...
ఎందువలన ఓ లలనా ఎందువలన?
ఎందువలన ఓ లలనా ఎందువలన??

మురిసిపోవు మనసులోని మధురభావన
మరుపురాని మరువలేని ఎవరిదీవెనా..
చిన్ననాటి మా చెలిమి చిగురించెను నేటికి
మనసు పయనమైనది మధురమైన చోటుకి...

తళతళా... మిలమిలా ...
తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా... ఆ..ఓ..ఓ...
ఎందువలన ఓ లలనా ఎందువలన?
ఎందువలన ఓ లలనా ఎందువలన..ఆ..ఆ



2 comments:

అప్పటి హీరోఇన్స్ నిజంగానే పౌర్ణమి చంద మామల్లా నిండుగా ఉండేవారండీ..ఇప్పటి హీరోఇన్స్ పాపం కొద్దిగా చిక్కిన నెలవంకల్లా ఉంటున్నారు..

హహహ మరే మా బాగా చెప్పారు శాంతి గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.