గురువారం, జనవరి 15, 2015

భ‌జే భాజే...

మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. పిండివంటల ఘుమ ఘుమలు, కొత్త బట్టల రెపరెపలు, కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కోలాహలం నడుమ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంటున్నారని తలుస్తాను. కొత్త సంవత్సరాన సంక్రాంతికి విడుదలైన మల్టీ స్టారర్ గోపాల గోపాల సినిమాలోని ఓ చక్కని కన్నయ్య పాటను ఈ సందర్బంగా తలచుకుందాం. సాక్షాత్ కన్నయ్యే భువికి దిగివచ్చి భక్తులతో పరాచికమాడినట్లుగా అనంత శ్రీరాం రాసిన ఈ పాట నాకు బాగా నచ్చింది, మీరూ వినండి. ఈ పోస్ట్ లో ఎంబెడ్ చేసినది ఈ పాట వీడియో ట్రైలర్. పూర్తిపాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : గోపాల గోపాల (2015)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : హరిచరణ్, కోరస్

ఆలారే ఆలా.. ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడూ ఏదో లీల
ఆలారే అలా.. ఆయ నందలాల
ఆడలా ఈలేసాడో కోలాటాల గోలా గోల

 

దూరంగా రంగా దొంగా దాక్కోకోయ్ ఇయ్యాలా
వ‌చ్చి నువ్ మాతో సిందెయ్యాలా
మందిరం క‌ట్టింద‌య్యా భూమి నీకీవేళ‌
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవ‌డో ఏల.. ఇది నీ నేల
నువు చేసే ప్ర‌తి మంచీ ఎదురై ఎగిరేయ‌దా ఇలా..

భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే
భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే


దూరంగా రంగా దొంగా దాక్కోకోయ్ ఇయ్యాలా
వ‌చ్చి నువ్ మాతో సిందెయ్యాలా

భామ‌కే లొంగేటోడు బాధేం తీరుస్తాడు
ప్రేమ‌కే పొంగాడంటే ప్రాణం బ‌దులిస్తాడు

ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు 

న‌ల్ల‌ని రంగున్నోడు తెల్ల‌ని మ‌న‌సున్నోడు 
అల్ల‌రి పేరున్నోడు అంద‌రికీ అయినోడూ 
మీ పిచ్చీ ఎన్నాళ్లో అన్నాళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒక‌డై ఉంటాడు

భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే 
బజేరే బజేరే బజెరే..ఏఏ... 
భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే 
బజేరే బజేరే బజెరే..ఏఏ...

భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే 
బజేరే బజేరే బజెరే..ఏఏ... 
భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే
 బజేరే బజేరే బజెరే..ఏఏ...
భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే 
బజేరే బజేరే బజెరే..ఏఏ...
 భ‌జే భాజే ఆ డోలు భ‌జే భాజే ఆ డోలు భ‌జేరే 
 బజేరే బజేరే బజెరే..ఏఏ...


1 comments:

బెటర్ లేట్ దెన్ నెవ్వర్ అన్నారుగా..అందుకే..ఆలస్యంగా నైనా అందుకోండి శుభాకాంక్షలు వేణూజీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.