శనివారం, జనవరి 03, 2015

వ్రేపల్లియ ఎద ఝల్లున...

మధురమైన మురళీ గానం విని మైమరవని మనసుంటుందా అసలు, అచ్చంగా కన్నయ్య వినిపిస్తున్నాడేమో అనిపించె ఆహ్లాదకరమైన మురళీ నాదంతో ప్రారంభమయే ఈ పాట ముప్పై ఏళ్ళకు పైగా శ్రోతల ఎద కొల్లగొడుతూనే ఉంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల 

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ.. ఆనందన మురళీ
ఇదేనా.. ఇదేనా.. ఆ మురళి.. మోహనమురళీ
ఇదేనా.. ఆ మురళీ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ.. ఆనందన మురళీ
ఇదేనా.. ఆ మురళి..మోహనమురళీ
ఇదేనా... ఆ మురళీ


కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
కాళింది మడుగునా కాళియుని పడగలా
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి.. గుండెల మ్రోగిన మురళి
 

ఇదేనా..ఇదేనా ఆ మురళీ
 

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించి
జీవన రాగమై.. బృందావన గీతమై
ఆ.. జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి


ఇదేనా.. ఇదేనా ఆ మురళీ

ఆఆ..వేణుగానలోలుని మురిపించిన రవళి..
నటనల సరళి ఆ నందనమురళీ
ఇదేనా ఆ మురళి.. మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ...

మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురానగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
ఆ....... ఆ....... ఆ..... 

సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ

వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళీ
నవరస మురళీ..ఆనందన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళి..మోహనమురళీ
ఇదేనా ఆ మురళీ...


5 comments:

నాకు కూడా ఇష్టమైన పాట..
కృష్ణయ్య Animation చాలా బాగుంది.

థాంక్స్ రాజ్యలక్ష్మి గారు.

థాంక్స్ సుబ్బారావు గారు.

కులమతాలకతీతం గా రాసినా, తీసినా.. అది విశ్వనాధునికీ, ఆయన జంధ్యాల కే చెల్లు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.