ఆదివారం, జనవరి 18, 2015

పయనించే మన వలపుల...

బావామరదళ్ళు చిత్రం కోసం పెండ్యాల గారు స్వరపరచిన ఒక చక్కని పాటను నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బావమరదళ్ళు (1960)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...
నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

ఊ...ఊ...ఊ..ఊ..ఊ..
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగి...
 

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...
నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు...
వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు
రవళించె వేణుగీతి...రవళించె వేణుగీతి...
రమ్మని పిలువా..ఆఆఅ..

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...
నా జీవనతార..ఆ..ఆ
పయనించే...
ఉహు ఉహు..ఊ..ఉహు..ఉహు..ఊ...


3 comments:

చాలా కాలం తర్వాత మీ పాటల పూదోటలోకి ప్రవేశించానండి. ఈ పాట గురించి ఒకసారి మిమ్మల్ని అడిగాను నేను. చూడలేకపోయినా ఈ సినిమాలోని పాటలన్నీ చాలా నచ్చుతాయి. ధన్యవాదాలు విరజాజుల్ని వికసింపజేసినందుకు...
సుధామయి

థాంక్స్ సుధామయి గారు, ఈ పాట మీరు అడిగారనే ప్రచురించానండీ. ధనుర్మాసం అంతా కృష్ణుడి పాటల సిరీస్ ప్రచురిస్తూ ఉండడం వల్ల కొంత ఆలశ్యమైంది.

నిజమే తలపుల తలుపులు తెరిచే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.