ఇళయరాజా గారి స్వరకల్పనలో వేటూరి గారు రచించిన ఒక అందమైన పాట, అప్పటి కుర్రకారును ఊపేసిన పాట ఈ రోజు మీకోసం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : అభిలాష (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
కొండ కోనా జలకాలాడే వేళ
కొమ్మరెమ్మ చీరకట్టే వేళ
పిందె పండై చిలకకొట్టే వేళ
పిల్ల పాప నిదరెపోయే వేళ
కలలో కౌగిలే కన్నులు దాటాలా
ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
మల్లె జాజి మత్తుజల్లే వేళ
పిల్ల గాలి జోలపాడే వేళ
వానే వాగై వరదై పొంగే వేళ
నేనే నీవై వలపై సాగే వేళ
కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నలగువ్వ చీకటి గవ్వలాడాలా
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
మబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
ఎవ్వరికిస్తుందో ఏమవుతుందో
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలి గాలి రమ్మంది
2 comments:
పగలే ఎన్నలగువ్వ చీకటి గవ్వలాడాలా...హేట్సాఫ్ టు వేటూరి గారు..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.