బుధవారం, జనవరి 28, 2015

ఊహలేవో రేగే...

గుడ్ ఓల్డ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అంతం చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : అంతం (1992)
సంగీతం : ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, కవితాకృష్ణమూర్తి

హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
 
హో పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా

ఊహలేవోరేగే ఊపుతోననులాగే 
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా
ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ...
 
ఊహలేవోరేగే ఊపుతోననులాగే 
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

హో ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ  చెరిసగమైపోగా
హో..ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ..

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ..

 
లలలాల.. లాలలాలా.. లలలాలా
అ.ఆ...లాలలాలలాలా లాలలాలలలాలా


2 comments:

యెకార్డింగ్ టు మి..ఊర్మిళ అందంగా ఉంటుందనే భ్రమ చాలా మందిలో కలగడానికి కారణం రాముజీ యే నండి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.