హరిదాసులు, గంగిరెద్దుల వాళ్ళు, రంగవల్లులు, బంధు మిత్రులూ, ఆటపాటలూ, పిండి వంటలూ ఇతరత్రాలతో ఎంతో సందడిగా ముచ్చటగా మూడురోజులు జరుపుకునే సంక్రాంతి పండుగ చివరి రోజుకు వచ్చేసింది. ఈరోజు సంక్రాంతి సందడులలో ఒకరైన గంగిరెద్దులవాళ్ళను చూడగానే గుర్తొచ్చే ఓ చక్కని పాటను తలచుకుందామా. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అక్కినేని గారు ఎంతో హుందాగా ఈ పాత్రను పోషించారు. నాకెంతో ఇష్టమైన ఈ పాట చూసీ వినీ మీరుకూడా ఆనందించండి. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సిరివెన్నెల
గానం : బాలు, మనో
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సిరివెన్నెల
గానం : బాలు, మనో
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
తందనాలు తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు తకిట తందనాలు
వందనాలు వందవందనాలు
తందనాలు తకిట తందనాలు
తందనాలు తకిట తందనాలు
సన్నాయి స్వరమెక్కి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ కన్నార కనులార
సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ సెవులార విన్నారా
చెన్నార చిందాడ కన్నార కనులార
సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ సెవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా..
కోదండ రామన్న గోవుల్ల గోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు
వందనాలు వందవందనాలు
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాలా..
కోదండ రామన్న గోవుల్ల గోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు
వందనాలు వందవందనాలు
1 comments:
ఇలాంటి పాటల్లో తప్ప ఈ రోజుల్లో గంగిరెద్దు వాళ్లని చూడటం గగనమై పోయిందండి..ఇక హరిదాసులైతే ఙాపకాల్లో మాత్రమే ఉన్నారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.