ఆదివారం, జనవరి 25, 2015

సంధ్యా రాగపు సరిగమలో...

ఇళయరాజా గారి పాటలలో నాకు ఇష్టమైన పాట, కమల్ విజయశాంతిల పై అందంగా చిత్రీకరించిన పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డో రే మీ రాగాల జోరేమీ
దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే
కనుల కనుల నడుమలో కలలసుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే
తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలూ కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమనీ రేయిలా వాలిపో ప్రియా 

ఓ ఓ ఓ.....
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డో రే మీ రాగాల జోరేమీ
దా సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే

తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదై పోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటలా తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా

ఓ ఓ ఓ...
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డో రే మీ రాగాల జోరేమీ
ద సా దా నా ప్రేమ నీమీద శృతికలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో 


2 comments:

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ హెర్ ఫాన్స్ విజయశాంతి కూడా అందంగా ఉంటుందని ఈ మూవీ చూశాకే అనిపించందండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.