శుక్రవారం, జనవరి 02, 2015

నీ పేరు తలచినా చాలు...

కన్నయ్య పేరు తలచుకున్నా చాలు మదిలో శతకోటి యమునా తరంగాలు ఉప్పొంగుతాయట... నిజమే కదా ఆయన పేరులో ఉన్న మహత్యమే అంత... ఏకవీర చిత్రంలో సుశీల గారు గానం చేసిన ఈ పాట ఎంత బాగుంటుందో మీరే వినండి. ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఏకవీర (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : సుశీల

కృష్ణా....
నీ పేరు తలచినా చాలు
నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి 
యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

ఏమి మురళి అది ఏమీ రవళి రా..అ.ఆ..
ఏమి మురళి అది ఏమీ రవళి రా
పాట వినగ ప్రాణాలు కదలురా
ఏమీ మురళి అది ఏమీ రవళి రా
పాట వినగ ప్రాణాలు కదలురా
మురళీధరా నీ స్వరలహరులలో
మరణమైనా మధురమురా

నీ పేరు తలచినా చాలు

వెదురు పొదలలో తిరిగీ తిరిగీ
నీ పదపల్లవములు కందిపోయేనో
వెదురు పొదలలో తిరిగీ తిరిగీ
నీ పదపల్లవములు కందిపోయేనో
యెదపానుపుపై పవళించరా
నా పొదిగిన కౌగిట పులకించరా

నీ పేరు తలచినా చాలు
మదిలో పొంగు శతకోటి 
యమునా తరంగాలు
నీ పేరు తలచినా చాలు

గోపాలా.. నందబాలా..
నవమంజుల మురళీలోల
మృదు సమీర కంపిత
మనోజ్ఞకుంతల తమాలపల్లవజాలా

కృష్ణా నీ పేరు తలచినా చాలూ

ఏమీ పిలుపు అది ఏమి పిలుపు
బృందానికుంజముల పూలు పూసి
శరదిందు చంద్రికల కేయిసాకి
కరుణాంతరంగముల దాగి దాగి
చెలి అందెలందు చెలరేగి రేగి
నను తొందరించెరా ..ఆ...తొలకరించెరా..ఆ..
తొందరించెరా తొలకరించెరా
వలపు జల్లుగా పలుకరించెరా
వల్లవీరమణి చల్లని ఉల్లము
అల్లన ఝల్లన పరవశించెరా..ఆ..ఆ..

కృష్ణా....
నీ పేరు తలచినా చాలు


1 comments:

నిజమే సుమండీ ఈ సంవత్సరం విష్ణు మయం గా ప్రారంభమైంది కదా..అందుకే బోలెడు పూజలూ..ఆ తరువాత శివమయం గా యెన్నో పుణ్యక్షేత్రాలూ..బిజీ..బిజీ..ఆలస్యంగా నైనా అందుకోండి శుభాకాంక్షలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.