మంగళవారం, జనవరి 20, 2015

నీలగిరి చల్లనా...

నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. చక్రవర్తి గారి సంగీతం సింపుల్ గా ఒక చక్కని రిథమ్ తో సాగిపోతుంది, అలాగే వాణీజయరాం గారి స్వరం ఒక వింత అందాన్నిచ్చింది. నాకు ఇష్టమైన ఈ పాటను మీరూ వినండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : జీవితంలో వసంతం (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, వాణీ జయరాం

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన   
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా
సోలి సోలి పోదామా
ప్రియతమా... ప్రియతమా ఓ ఓ ఓ 

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
 
నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
 
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు  

ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం
అహహహహ
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా 
ప్రియతమా... ప్రియతమా

నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల 
 
ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా 
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో 

ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం
ఓహోఓహో
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో... 
నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా... తేలి తేలి పోదామా
సోలి సోలిపోదామా...
సోలి సోలిపోదామా
ప్రియతమా... ప్రియతమా


3 comments:


నీ 'లాహిరే' చల్లన !!

జిలేబి

థాంక్స్ జిలేబి గారు :-)

ఈ పాట మనసుని హాంట్ చేస్తుంది..యేవేవో ఆలోచనల్లో ముంచేస్తుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.