మంగళవారం, జనవరి 13, 2015

జీవితమే కృష్ణ సంగీతము...

సుసర్ల దక్షిణామూర్తి వారి స్వర సారధ్యంలో బాలమురళీ కృష్ణ గారు గానం చేసిన ఈ వేటూరి రచన శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటుంది. బాలమురళి గారి గళం విని మైమరచిపోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మొదట్లో వచ్చే మురళీనాదమే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు ఇష్టమైన ఈ పాట మీరు కూడా విని ఆనందించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీమద్విరాటపర్వము (1979)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : వేటూరి
గానం : మంగళంపల్లి బాలమురళీకృష్ణ

ఆఆఅ...ఆఆ...ఆఆఆ...
జీవితమే కృష్ణ సంగీతమూ.. 
జీవితమే కృష్ణ సంగీతమూ.. 
సరిసరి నటనలు స్వరమధురిమలు 
అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 
అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 
యమునా నదీ లహరికా నాట్య గీతము.. 

జీవితమే కృష్ణ సంగీతమూ..  

నందుని నట్టింటి కరి లేగదూడా.. 
కాళింది లో కేళిగా పాము తలనాడా.. 
నందుని నట్టింటి కరి లేగదూడా.. 
కాళింది లో కేళిగా పాము తలనాడా.. 
గోకులమది చూడ గోపబాలకులాడా 
ఆఆఅ..ఆఆ....
గోకులమది చూడ గోపబాలకులాడా 
అది విన్న ఇల్లాలు యశోదమ్మ అల్లాడ.. 
ఆనంద తాండవమాడినా ఆనందనందనుని 
శ్రీ పాద యుగళ శ్రీ పారిజాత సుమదళాలా 
పరిమళాల పరవశించే 

జీవితమే కృష్ణ సంగీతమూ..  

వెన్నల రుచికన్నా.. 
వెన్నల రుచికన్నా మన్నుల చవిమిన్న
అన్నన్నా ఇది ఏమి అల్లరిరా అన్నా..
తెరచిన తన నోట తరచి చూచిన కంట 
ఈరేడు భువనాలు కనిపించెనంట 
ఆబాలగోపాలమది కని ఆ బాల గోపాల దేవుని 
పదమునాను కథలు విన్న 
ఎదలు పొంగి యమునలైన మా.. 

జీవితమే కృష్ణ సంగీతమూ.. 
సరిసరి నటనలు స్వరమధురిమలు 
అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 
అంతరంగాన ఊగే రస తరంగాల తేలే 
యమునా నదీ లహరికా నాట్య గీతమూ.. 

జీవితమే కృష్ణ సంగీతమూ.. 


1 comments:

సాక్షాత్తూ బాలమురళీ గారే ఆలపించడం తో ఈ పాట లో కృష్ణ సంగీతం గంగా ప్రవాహం లా మదిని కుదిపేస్తుంది..ఒక మురళీ తిల్లానా లా మనని చుట్టేస్తుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.