శుక్రవారం, జనవరి 09, 2015

పాట పాడుమా...

సాలూరి వారు స్వయంగా రచించి స్వరపరచి గానం చేసిన ఒక అందమైన పాట ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. కమ్మటి సంగతులతో వారు అద్భుతంగా స్వరపరచి గానం చేసిన విధానం వినేవారి మనసులలో అమృతధారలు కురిపిస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ వినండి. యూట్యూబ్ పని చేయకపోతే ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


లలిత గీతం
సంగీతం, సాహిత్యం, గానం : సాలూరి రాజేశ్వరరావు

పాట పాడుమా..ఆఅ..
పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆఅ...

శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె..ఏ..
శ్రుతిలయాదులన్ని చేర్చి
యతులు నిన్ను మదిని తలచె
సదమల హృదయా నిన్ను
సన్నుతింతు వరనామము

పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా

సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా..ఆఅ..
సామవేద సారము
సంగీతము సాహిత్యమెగా
దానికంతమగు గానము
పాటకూర్చి పాడుమా

పాట పాడుమా కృష్ణా
పలుకు తేనె లొలుకు నటుల
మాటలాడుమా ముకుందా
మనసు తీరగా...ఆఆ..ఆ..


3 comments:

రసాలూరు సాలూరి వారి గొంతులో నించి జాలువారిన ఈ పాట వినగలుగుతున్నందుకు మనం చాలా అదృష్టవంతులమండీ..అందు బాటులో ఉంచిన ప్రతి ఒక్కరికీ ఈ సంధర్భం గా కృతఙతలు..

ఈ పాట డౌన్లోడ్ అవ్వడం లేదు

డౌన్లోడ్ చేస్కోవాలంటే సౌండ్ క్లౌడ్ యూజర్ ఐడీ ఉండాలనుకుంటానండీ.. మీకు ఏం ఎర్రర్ వస్తుందో తెలియజేయండి. నాకు ఏ సమస్యా కనిపించటం లేదు బాగానే డౌన్లోడ్ అవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.