శనివారం, జనవరి 10, 2015

పాడెద నీ నామమే...

హృదయంలో నీ రూపాన్నే నిలిపి నిరంతరమూ నీ నామమే పాడెదనంటూ ఈ గోపికమ్మ ఆ గోపాలుడిని ఎంత చక్కగా అర్చిస్తోందో మీరే వినీ చూసీ తెలుసుకోండి. కన్నయ్య పాట సుశీలమ్మ గళంలో సాలూరి వారి స్వరకల్పనలో ఎంత కమ్మగా ఉంటుందో మాటలలో వర్ణించి చెప్పతరమా. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.


చిత్రం : అమాయకురాలు (1971)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల

ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
పాడెద నీ నామమే గోపాలా
పాడెద నీ నామమే గోపాలా
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా..ఆ..అ..
 
పాడెద నీ నామమే గోపాలా
 
మమతలతోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
మమతలతోనే మాలికలల్లి
నిలిచితి నీకోసమేరా
ఆశలతోనే హారతి చేసి
పదములు పూజింతు రారా
 
పాడెద నీ నామమే గోపాలా
 
నీ మురళీ గానమే పిలిచెరా
కన్నుల నీమోము కదలెనులేరా
నీ మురళీగానమే పిలిచెరా
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై 
ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...  
పొన్నలు పూచే బృందావనిలో
వెన్నెల కురిసే యమునాతటిపై
నీ సన్నిధిలో జీవితమంతా ..
కానుక చేసేను రారా

పాడెద నీ నామమే గోపాలా
హృదయములోనే పదిలముగానే
నిలిపెద నీ రూపమేరా...
పాడెద నీ నామమే గోపాలా...


1 comments:

నీవు కాక వేరెవరూ నా మదిలో లేరని ధాటీగా చెప్పినట్టు ఉంటుందీ పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.