శుక్రవారం, జనవరి 30, 2015

పదిమందిలో పాట పాడినా..

ఆనందనిలయమ్ చిత్రం కోసమ్ పెండ్యాల గారు స్వరపరచిన ఒక చక్కని ఆరుద్ర రచనను ఈరోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : ఆనంద నిలయం (1971)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

పదిమందిలో పాటపాడినా..
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే
 
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..
గోపాలునికెంతమంది గోపికలున్నా
గుండెలోన నెలకొన్నా రాధ ఒక్కటే..
ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా
అందాల జాబిల్లి అసలు ఒక్కడే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే

ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.. వసంతమొక్కటే
ఏడాదిలో ఎన్ని ఋతువులున్ననూ
వేడుక చేసే.. వసంతమొక్కటే
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
నా కన్నులందు ఎన్నివేల కాంతులున్ననూ
ఆ కలిమి కారణం నీప్రేమ ఒక్కటే

పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే
విరితోటలో పూలెన్ని పూసినా
గుడికి చేరేది నూటికి ఒకటే
పదిమందిలో పాటపాడినా
అది అంకితమెవరో ఒకరికే


2 comments:

ఆన్ యే లైటర్ నోట్..పదిమందిని ట్రై చేసి, అందులో ఐదుగురి నైనా లవ్ చేసి, చివరికీ యెవరూ నచ్చక మరో పాటని అందుకోవడమే కరెంట్ ట్రెండ్..

హహహ నో కామెంట్స్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.