శనివారం, జనవరి 17, 2015

ప్రియా ప్రియా చంపొద్దే...

అందీ అందకుండా ఊరిస్తూన్న అందమైన ప్రేయసిని ఆమె అందాలతో తనని చంపోద్దని ఆ ప్రియుడు ఎలా వేడుకుంటున్నాడో మీరే చూడండి. జీన్స్ చిత్రం కోసం రెహ్మాన్ తొలినాళ్లలో కంపోజ్ చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జీన్స్ (1998)
సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : శ్రీనివాస్

ఆహా.హా.ఆఆ..ఆఆఅ...
ఆహా.హా.ఆఆ..ఆఆఅ...
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వన్నెలతో ప్రాణం తీయోద్దే
 
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే

చెలియా నీదు నడుమును చూసా అరెరే బ్రహ్మెంత పిసనారి
తలపైకెత్తా కళ్ళు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగ మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడుగుల శిల ఆరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమటా..
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా..
 
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే
 
అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేవా
అందమైన నదివే నదివే చెలి మేని సొగసు తెలిపేవా
అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేవా
అందమైన మణివే మణివే గుండె గుబులు తెలిపేవా

   
ఆహా.హా.ఆఆ..ఆఆఅ...
ఆహా.హా.ఆఆ..ఆఆఅ...
 

చంద్రగోళంలో ఆక్సిజన్ నింపి అక్కడ నీకొక ఇల్లుకడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా..
ఆహా.హా.ఆఆ..ఆఆఅ...
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జో కొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా..
పంచవన్నె చిలక జలకాలాడగ మంచుబిందువులె సేకరిస్తా..
దేవత జలకాలాడిన జలమును గంగా జలముగ సేవిస్తా..

ప్రియా ప్రియా చంపోద్దే...
ప్రియా ప్రియా చంపోద్దే నవ్వీ నన్నే ముంచోద్దే...
 
ఆహా.హా.ఆఆ..ఆఅఅ...

 

1 comments:

ఒక్కసారిగా ఫ్లాష్ బేక్ లో నించి టైం మిషన్ లో ఫ్యూచర్ కి వచ్చేసినట్టుందండీ..మంచి పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.