మిత్రులందరకూ భోగి పండుగ శుభాకాంక్షలు. ఉదయమే చలిమంటలు వేసి పిల్లలకు భోగిపళ్ళు పోశారా.. ఈ రోజు ధనుర్మాసపు చివరి రోజు గోదాకళ్యాణమైన పుణ్యదినం. నేటితో ఈ బ్లాగ్ లో కన్నయ్య పాటల సిరీస్ కు స్వస్తి. ఈ సందర్బంగా మొల్ల కు గోదా దేవి కళ్యాణం గురించి చెప్పినప్పటి సందర్బంలోని ఈ పాట తలచుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : కథానాయిక మొల్ల (1970)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : జానకి
విందువా వీనుల విందుగా
గోవిందునాండాళ్ళు పరిణయమ్మైన గాథ
ఉన్నదా విల్లి పుత్తూరు అందుగలరు
శ్రీహరి కింకరులు పెరియాళ్వారు
వారి చిన్నారి కుమారి ఆండాళ్ళు
శ్రీ తులసీ వనములోన వెలసే కూన
అయ్యకన్నను మిన్న ఆ కన్నె
శ్రీరంగ పురిని వేంచేసిన హరిన వలచి
పతిగా కొలిచి మేటి వ్రతమూని
కృతులన్ని సరసిజాక్షుని అలంకరణమునకు
ఏరి పూలా కూరిచి మాలా ఎలమిదాని
ముదిత తన క్రొమ్ముడిని మునుముందె ముడిచి
అద్దమున చూచి తలయూచి అలరే
అవల కోవెలకేగి పెరుమాళ్ళకొసగుచుండె..ఏ..
ఏ..ఏఎ...ఆఆఅ..ఆ
అపుడా శ్రీహరి
చెదరదుగదే చెలువ చిత్తము రవంతా..ఆఅ..ఆ
పెరచింత విడనాడుకొని నన్నె
హృదయమున నిలుపుకొనె పదిలముగా ఆఅ..
అని మెచ్చి సదయుడై
శ్రీరంగ నగరీ సదనుడు ఆళ్వారుల కదలి రావించి
ఆ సుదతి తన దేవిగ వరించెన్
ముదమొందె ముల్లోకములును..
గోదాదేవి భువనమోహనుడు పెండ్లాడగా..ఆఅ..ఆ
చూశావా మొల్ల తులసీ వనములోన దొరికిన మొలక
అలహరి వలపు పంజరపు రాచిలుకా..ఆఅ..
3 comments:
వేణుగారూ! మంచి సిరీస్ అందించినందుకు కృతజ్ఞతలు. వీలైతే శ్రీరాముడిమీద ఉన్న అత్యుత్తమ పాటలతోకూడా ఒక సిరీస్ తయారుచేయగలరు. ఉదా.కు 1) పూజలు చేయ పూలు తెచ్చాను...
2)నీ దయరాదా రామా(పూజ సినిమా అనుకుంటా...)
3)శ్రీరామ జయరామ సీతారామ(బాలమురళీకృష్ణ)
థాంక్స్ శ్రవణ్ గారూ... రాముడి మీద నెలరోజులు కాదుకానండీ నవమి అప్పుడు ఒక వారం చిన్న సిరీస్ వేశాను. మళ్ళీ తప్పక ప్రయత్నిస్తాను.
పాటల పల్లకీ నించి పెళ్ళి పల్లకీ దాకా ధనుర్మాసాన్ని మళ్ళీ ఒక సారి చేసుకున్న అనుభూతి కలిగింది వేణుగారూ..గీతం సమర్పయామి అని పూజల్లో మేమందరం చదువుతాము..మీరు ఆచరిస్తున్నారు..అభినందలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.