సోమవారం, జనవరి 12, 2015

పాడవేల రాధికా...

ఎస్. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గానం చేసిన మరో అమృత గుళిక ఈరోజు మనందరి కోసం. ఈ పాట రెండవ చరణంలో శ్రీశ్రీ గారు అంత్యప్రాసలతో ఆకట్టుకుంటారు. ఇక సాలూరి వారి స్వరరచన సంధ్యవేళ పిల్లతెమ్మెరలా తాకుతుంది. సాక్షాత్ గోపాలుడే ఈ రాధిక గానానికి పరవశించి బృందావని వీడి వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, సుశీల

ఆ..ఆ ..ఆఆ...ఆఆఆ...ఆఆఆ....
ఓఓ.. ఓఓ..ఓఓఓఓ...ఓఓఓఓఓఓ.....
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా

ఈ వసంత యామినిలో..ఓ..ఓ..
ఈ వెన్నెల వెలుగులలో..ఓ..ఓ..
ఈ వసంత యామినిలో
ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ
జీవితమే పులకించగ
నీ వీణను సవరించి 

పాడవేల రాధికా

గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి
ఏ మూలనొ పొంచి పొంచి
ఏ మూలనొ పొంచి పొంచి
వినుచున్నాడని ఎంచి 

పాడవేల రాధికా

వేణుగానలోలుడు నీ వీణా
మృదు రవము వినీ
ఈ....ఈ...ఈఈ....ఈఈఈ.....
వేణుగానలోలుడు నీ వీణా
మృదు రవము వినీ
ప్రియమారగ నిను చేరగ
దయచేసెడి శుభ వేళ 

పాడవేల రాధికా....

ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా..

1 comments:

జయదేవుడు కూర్చుని ఆలపిస్తే బహుశా ఇలానే ఉంటుందేమో..ఈ పాట అచ్చ తెనుగు అష్ట పది లా ఉంటుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.