గురువారం, జనవరి 08, 2015

నీ చరణ కమలాల...

తన స్వామి చరణాల నీడ బృందావనం కన్నా మేలని దేవేరి... తన దేవేరి కనులలో విరిసే సాంత్వన నందనవనాలలో కూడా లభించదని కన్నయ్య చెబుతున్నారు... ఆలూమగల అన్యోన్యత అంటే ఇదే కదా... శ్రీకృష్ణావతారం చిత్రం లోని ఈ పాట ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ కృష్ణావతారం (1967)
సంగీతం : టివి.రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల, పి.లీల

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు 
 
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందన వనాలు

నును మోవి చివురుపై
నను మురళిగా మలచి పలికించరా..ఆఆ..
పలికించరా మధువు లొలికించరా
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే 
మోవిపై కనరాని మురళిలో
వినలేని రాగాలు పలికింతునే 
మధురానురాగాలు చిలికింతునే

నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు
నీ హృదయ గగనాన నేనున్న చాలు
ఎందుకే ఓ దేవి బృందావనాలు

తులసీ దళాలలో తొలివలపులందించి
 
తులసీ దళాలలో తొలివలపులందించి
పూజింతునా...ఆఆ..ఆఆఅ...
పూజింతునా స్వామి పులకింతునా
 
పూజలను గ్రహియించి పులకింతలందించి
పూజలను గ్రహియించి పులకింతలందించి 
లోలోన రవళింతునే 
లోలోన రవళింతునే 
ఓ దేవి నీలోన నివసింతునే  
ఓ దేవి నీలోన నివసింతునే

నీ చరణ కమలాల నీడయే చాలు
ఎందుకోయీ స్వామి బృందావనాలు
నీ నయన కమలాల నేనున్న చాలు
ఎందుకే ఓ దేవీ నందనవనాలు 
నీ ప్రణయ వనిలోన నేనున్న చాలు
ఎందుకోయీ స్వామి నందనవనాలు
 

1 comments:

అందమంతా పోగు పోసినట్టుండే ఆ ప్రేమ మూర్తులను చూస్తుంటే గుండె నిండి పోతుంది..ఈ పాట నిజం గా ఓ ఐ ఫీస్ట్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.