శనివారం, డిసెంబర్ 12, 2015

మొట్ట మొదటి సారి...

ఇటీవల విడుదలైన భలె భలె మొగాడివోయ్ సినిమాలోని ఒక చక్కని మెలోడీ ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భలె భలె మొగాడివోయ్ (2015)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సచిన్ వారియర్, కోరస్

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

 
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..
హేల... చారడేసి కళ్ళా...
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా...
ఓహో... హో హేల... పువ్వంటి పెదాలా
నా స్వాశనాపే బంగరు బాణాలా...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
మధు మంత్రం చవి చూస్తున్నా..
ఓ.. ఓ.. ఓ.. ఓ..
మర యంత్రం ఐపోతున్నా..
అడుగే నన్ను వద్దన్నా పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా...
నాలో ప్రేమనూ నీ కానుకివ్వగా
అర చేతులందు మొలిచెను పూవనం
నీ వల్లనే చెలీ
నా గుండే లోతుల్లో
ఓ పాలపుంత పేలిన సంబరం...

స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..

ఓ.. ఓ.. ఓ.. ఓ..
కనురెప్పల దోచెలి చాచా
ఓ.. ఓ.. ఓ.. ఓ..
కలలోకి నిన్నే పిలిచా
తొలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిచ్చా
నిదురకి ఇక సెలవిచ్చా
నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వూంటావా నా తోడుగా..
 
స స ప మ ప స స
స స ప మ ప స స
ప ప ని ని ప మ గ మ ప మ

 
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురయ్యింది చందమామా..



శుక్రవారం, డిసెంబర్ 11, 2015

గలగలగలగల గల్లంటు మనసే..

రేసుగుర్రం చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రేసుగుర్రం (2014)
సంగీతం : ఎస్.ఎస్.తమన్
సాహిత్యం : రెహ్మాన్
గానం : దినేష్ కనగరత్నం, మెగ

గలగలగలగల గల్లంటు మనసే
గలగలగలగల గాల్లోకి ఎగసే 
మాయో ఓ అమ్మాయో
యే ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె 
మాయో ఓ అమ్మాయో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత
మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే 
మాయో ఓ అమ్మాయో

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటె ఇల్ల
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎల్ల
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్ల
నన్నింకా నేను ఆపలేక ఆపలేక హో ఓ ఓ
గల గల గల గల గల్లంటూ మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్
I want to say my love
నువ్వంటే పిచ్చి ప్రేమలే
ఆగమంటే ఆగిపోదే దాగామంటే దాగిపోదే
ఉన్నచోటే ఉండనీదే నిన్ను వీడి ఉండదె 
మాయో ఓ అమ్మాయో
 
రెక్కలోచినట్టు ఉంది కాళ్ళకే హేయ్
నేను రెప్పలైన వేయలేను అందుకే హేయ్ 
హేయ్ ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే
నువ్వు చెతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే హేయ్
నా శ్వాసలోన నువు చేరినందుకే
I wish i wish i could be with you 
for longer longer life along
Don’t break my heart 
don’t just leave me all alone alone alone

ఓ అద్ధమల్లె కళ్ళముందు నువ్వు ఉంటే ఇల్ల
నా గుండెలోని వేగమేంతో చెప్పమంటే ఎలా
నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్ల
నన్నింకా నేనే ఆపలేక ఆపలేక హో ఓ ఓ ఓ
గల గల గల గల గల్లంటు మనసే
గలగలగలగల గాల్లోకి ఎగసే మై లవ్
ఐ వన్న సే మై లవ్
నువ్వంటే పిచ్చ ప్రేమలే
గల గల గల గల గల్లంటు మనసే
గల గల గల గల గాల్లోకి ఎగసే 
మాయో ఓ అమ్మాయో

Got a phone call your మామ
Tell her that i said you గాటో beautiful daughter యమ
Let me take her on a ride to the paradise
Girl she looks like wine with chill ice
You better tell me now
You gona move it down
You better bring to the love what i wanna live now
live now live now

నువ్వంటే పిచ్చి ప్రేమలే నువ్వంటే పిచ్చి ప్రేమలే

గురువారం, డిసెంబర్ 10, 2015

ఈ వేళలో నీవు...

గులాబి చిత్రం కోసం సునీత గానం చేసిన ఓ మంచి పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సునీత

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ
 
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
 
 నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవూ
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేమీ కనిపించనంటోంది 
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
 
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు.. నవ్వుకుంటావు 

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ వుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటూ ఊహూ..హూ..హూహూ..


బుధవారం, డిసెంబర్ 09, 2015

బంగాళాఖాతంలో...

బద్రి సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : బద్రి (2000)
సంగీతం : రమణ గోగుల
రచన : చంద్రబోస్
గానం : రమణ గోగుల, సునీత

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో

రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
 
స్పీడోమీటర్‌కందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక ఆహాహా అలుపురాదెప్పుడు

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో 

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
లవ్ వైరస్సే సోకిందయ్య


మంగళవారం, డిసెంబర్ 08, 2015

కొడితే కొట్టాలిరా...

మణిశర్మ సంగీతంలో వచ్చిన ఠాగూర్ సినిమాలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

చిందే వెయ్యాలీ నటరాజు లాగ
నవ్వే చిందాలీ నెలరాజులా
మనసే ఉండాలీ మహరాజు లాగ
మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ

చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే
చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే
మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే
మనసున్నది ఆ మాటని నెరవెర్చేటందుకే
ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే
అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే
ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే
చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ
పొందే ఫలాన్ని పంచివ్వాలీ
అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ
ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ


పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా
చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా
లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా
ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా
శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా
సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా
ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా
దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు
రక్తం పంచిన బంధం మీరు
చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు
నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే...

కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ
ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ
బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ
పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి
చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ

 

సోమవారం, డిసెంబర్ 07, 2015

జయత్వదభ్రవిభ్రమ...

ఈ ఏడాదికి చివరి కార్తీక సోమవారమైన ఈ రోజు ఆ పరమశివుడిని స్మరిస్తూ సీతారామ కళ్యాణం చిత్రంలోని ఈ శివతాండవ స్త్రోత్రం తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సీతారామ కళ్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల
సాహిత్యం : రావణబ్రహ్మ (వాల్మీకి)
గానం : ఘంటసాల

జయత్వదభ్రవిభ్రమ భ్రమద్భుజంగ మశ్వస
ద్వినిర్గమత్ క్రమస్ఫురత్ కరాళఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః

ఓం నమః శ్శివాయ

అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే

ఓం నమః హరాయ

ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా
వలంబి కంఠకందలీ రుచుప్రబద్ధకంధరం
స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే

ఆదివారం, డిసెంబర్ 06, 2015

ఎప్పుడూ మీ పాఠాలంటే...

అమ్మమాట చిత్రం కోసం సుశీల గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమ్మ మాట (1972)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సినారె 
గానం : సుశీల

సర్.. సార్... సార్...
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

ఒకటీ ఒకటీ కలిపితే రెండు అది గణితం
మనసు మనసు కూడితే ఒకటే ఇది జీవితం
గిరి గీసుకుని ఉండాలంటాయి గ్రంథాలు
గిరి గీసుకుని ఉండాలంటాయి గ్రంథాలు
పురి విప్పుకుని ఎగరాలంటాయి అందాలు

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

కళ్ళల్లో చూడండి కనిపించును మీనాలు
పెదవుల్లో చూడండి అగుపించును పగడాలు
దోసిలి నిండా దొరుకుతాయి దోర నవ్వుల ముత్యాలు
కన్నెమేనిలో ఉన్నాయి కన్నెమేనిలో ఉన్నాయి
ఈ భువిలో దొరకని రతనాలు

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..

రాధా మాధవ రాగ జీవనం ఒక బంధం
కలువ జాబిలి వింత కలయికే అనుబంధం
యుగ యుగాలకు మిగిలేదొకటే అనురాగం
యుగ యుగాలకు మిగిలేదొకటే అనురాగం
చెలి మనసెరిగిన చినవానిదేలే ఆనందం

ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..
ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్..
ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్..


 

శనివారం, డిసెంబర్ 05, 2015

పట్టి తెచ్చానులే...

ఆత్మబంధువు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పన లో వచ్చిన ఒక మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

మనసున సెగ యెగసే 

ఏ మాయో వెలుపల చలి కరిచే 
వయసుకు అదివరసా 
వరసైన పిల్లదానికది తెలుసా
మాపిటికి చలిమంటేస్తా.. కాచుకో కాసంతా
ఎందుకే నను ఎగదోస్తా.. అందుకే పడి చస్తా
చింతాకుల చీర గట్టి పూచింది పూదోట
కన్నేపువ్వు కన్ను కోడితే తుమ్మెదకూ దొంగాటా
దోబూచిలే నీ ఆటా...ఊహూ..

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని 

కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు మూయ్యి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...

పొద్దు ఉంది ముద్దులివ్వనా.. 

ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్ని విప్పి చూడనా.. 

చూశాక మూటకట్టి లెక్క చెప్పనా
నోటికి నూరైతేనే.. కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే.. కోరికలే కొసరేనా
నోరున్నది మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరయింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్లా అంతా డూపు

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మావ కోసం

ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు మూయి చూపుతాను అన్ని

పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహా నా మల్లి కోసం...



శుక్రవారం, డిసెంబర్ 04, 2015

వసంతం పల్లకి...

వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన స్వరకల్పన చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లో మరింత క్లారిటీతో ఆడియో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : స్వరకల్పన (1989) 
సంగీతం : అమర్ (గంగై అమరన్)
సాహిత్యం : ??
గానం : బాలు, జానకి

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

గుసగుసల కిసలయం
కిలకిలల జలజంనవమదన మదగజం
కనబడుట సహజం
ఎటు చూసినా నీ రూపమే
ఎద మీటవా ఋతురాణిలా
అందాల బాలా అజవరాలా
అరవిరుల మరుల లలన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి

కొసమెరుపు కులుకుల
కువకువల నెమలి
విరి పొదల మధువుల
రిమరిమల భ్రమరి
వర్దిల్లుమా వాసంతమా
వడబోసిన రసభావమా
లోకాలనేలే నెరజాణా
నవధవళ కమల లయన

వసంతం పల్లకి వనాల రాణికి
సుగంధం పల్లవి సుధామయ గీతికి
సరాగం సాగగానే మురళి సరళి
పరాగం పాట పాడె పవన రమణి
జగాలే ఊగే తియ్యని హాయిలో

వసంతం ఆహహా.. లలలల్లా..

 

గురువారం, డిసెంబర్ 03, 2015

చారడేసి కనులతో...

రహస్యం చిత్రం లోని ఓ మధుర గీతాన్ని నేడు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రహస్యం (1967)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను
గగనమంత మనసుతో కలుసుకో నన్ను
చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను

గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను
దోర దోర వయసుతో దోచుకో నన్ను 
గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను

మదనుడు నిన్ను గని పొదలో దాగెను..
ఆహా ఆహా ఆహహహ
చంద్రుడు నిన్ను గని చాటుగ ఆగెను..
ఓహో ఓహో ఓహొహొహహొ
మదనుడు నిన్ను గని పొదలో దాగెను..
చంద్రుడు నిన్ను గని చాటుగ ఆగెను..
ఈ మోహన రూపం ఎన్నాళ్ళు దాచేవు
ఇలాగే ఇలాగే నిలవాలి నీవు

చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను

పిల్ల తెమ్మెరలో నీ పిలులుపులు విన్నాను..
ఆ.ఆ.ఆ.ఆఅహహహ..
అణువు అణువున నీ అందాలు కన్నాను
ఓ..ఓ..ఓ..ఓహొహొహొ..
పిల్ల తెమ్మెరలో నీ పిలులుపులు విన్నాను
అణువు అణువున నీ అందాలు కన్నాను
ఏనాడొ నీలోనే లీనమై ఉన్నాను
ఏనాడొ నీలోనే లీనమై ఉన్నాను
ఇలాగే ఇలాగే నిలిచేను నేను

గగనమంత మనసుతో కలుసుకొంటి నిన్ను
దోర దోర వయసుతో దోచుకో నన్ను 
చారడేసి కనులతో చేరుకొంటి నిన్ను
ఆహాహహహ..ఆహాహాహాహా...


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.