శనివారం, మే 10, 2014

నీవే నీవే నీవే నేనంటా...

చక్రి సంగీత దర్శకత్వంలో చక్కని లిరిక్స్ తో పెద్దాడ మూర్తి రాసిన ఒక చక్కని అమ్మ పాట ఇది. ఈ లిరిక్స్ నాకు చాలా ఇష్టం అలాగే చిత్రీకరణ కూడా. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమ్మానాన్న ఓ తమిళమ్మాయి (2003)
సంగీతం : చక్రి 
సాహిత్యం : పెద్దాడ మూర్తి 
గానం : చక్రి 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా..
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే 

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే..
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా.. 
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం 
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. 
 

శుక్రవారం, మే 09, 2014

చిన్ని తండ్రీ నిను చూడగా...

అమ్మకి పాపాయి ఎంత అపురూపమో చెప్తూ అమ్మ ప్రేమను చక్కగా కళ్లముందుంచే ఈ పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్. మీరూ చూసీ వినీ ఆస్వాదించండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సిసింద్రీ (1995)
సంగీతం : రాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : స్వర్ణలత 

చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా

చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా 

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రీలా చిందు చూడు
పిలిచినా పలకడూ వెతికినా దొరకడు
మా మద్య వెలిసాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు   


చిన్నితండ్రీ నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా 

ఆ మువ్వగోపాలుళ్ళా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసున నందనం విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు

చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామ చుసావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని 

గురువారం, మే 08, 2014

అమ్మా అమ్మా అని పిలిచావు...

కె.వి.మహదేవన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కని అమ్మపాట మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : విచిత్ర బంధం (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం :  పి. సుశీల

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 

ఎవరికీ మనసివ్వని దానను.. 
ఏ మమతకు నోచుకోని బీదనూ..
ఎవరికీ మనసివ్వని దానను.. 
ఏ మమతకు నోచుకోని బీదనూ..
మోడులా ఈ బ్రతుకుని మోసాను
మోడులా ఈ బ్రతుకుని మోసాను
నీ ముద్దు మోమును చూచి మరల మొలకెత్తాను

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 
 
కన్నతల్లి ఎవరో ఎరుగవు నువ్వు..
కడుపు తీపి తీరని తల్లిని నేను..
కన్నతల్లి ఎవరో ఎరుగవు నువ్వు..
కడుపు తీపి తీరని తల్లిని నేను..
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో..
కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో 
ఒకరి కొరతనింకొకరు తీర్చుకునేటందుకో 

అమ్మ అమ్మా అని పిలిచావు.. 
ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావూ.. 
ఏ తల్లి కన్న బాబువో.. 
నా కాళ్లకు బంధం అయినావు.. 
అమ్మ అమ్మా అని పిలిచావు.. 
 

బుధవారం, మే 07, 2014

పెదవే పలికిన మాటల్లోన...

నాని సినిమా కోసం రెహ్మాన్ ట్యూన్ చేసిన ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నాని (2004)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : చంద్రబోస్
గానం : ఉన్నిక్రిష్ణన్, సాధనాసర్గం

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి ఆమ్మగా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగ కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్లో ఒదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్లు సాకనా చల్లగ చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
 
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో బజ్జో లాలి జో బజ్జో లాలి జో 

 

మంగళవారం, మే 06, 2014

అమ్మ అన్నదీ ఒక కమ్మని మాట

సత్యం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక కమ్మనైన అమ్మ పాట నాకు ఇష్టమైనది మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు, సుశీల

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూట

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...మమతలమూట

దేవుడే లేడని మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
దేవుడే లేడని మనిషున్నాడు
అమ్మేలేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..మమతలమూట
 

అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
 
అమ్మ మనసు అమృతమేచిందురా
అమ్మ మనసు అమృతమేచిందురా
అమ్మ ఓడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా 

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...మమతలమూట


అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే

అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట 

 

సోమవారం, మే 05, 2014

అమ్మా అని కొత్తగా...

వచ్చే ఆదివారం పదకొండో తారీఖు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారం రోజులు కమ్మనైన అమ్మపాటలు తలచుకుందామా. ముందుగా చిన్న చిన్న హ్యూమన్ ఎమోషన్స్ ని సైతం చక్కగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలోని ఈ అమ్మ పాట మీకోసం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సాహిత్యం : వనమాలి 
గానం : శశికిరణ్, శ్రావణభార్గవి

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ

 
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీ
తుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీ


నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన ఎదకీ
ఏ క్షణం ఎదురవుతావొ జోల పాటవై
ఆకలని అడగక ముందే నోటిముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావొ జాబిలమ్మవై
 
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా

చిన్ని చిన్ని తగవులె మాకు లోకమైన వేళా
నీ వెతలు మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా
 
నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా 

(ఆడియోలో పైన ఉన్న రెండో చరణాన్ని సినిమాలో ఈ క్రింది చరణంతో రిప్లేస్ చేశారు)

నీకు పసిపాపలమేగ ఎంత ఎదుగుతున్నా
జాలిపడి మాజతలోనే ఉండిపో ఇకా
ఆఖరికి దేవుడికైనా అమ్మ మనసు ఉంటే
నీకు తన బదులుగ కొత్త జన్మ నివ్వడా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా  

 

ఆదివారం, మే 04, 2014

నీలి మేఘమా అంత వేగమా...

విలేజ్ లో వినాయకుడు సినిమా కోసం కార్తీక్ పాడిన ఒక చక్కని పాట మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : విలేజ్ లో వినాయకుడు (2009)
సంగీతం : మణికాంత్ కద్రి
సాహిత్యం : వనమాలి
గానం : కార్తీక్

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా నేలకీ రంగులు నీ వరమా
తూనీగా రెక్కలే పల్లకీగా.. 
ఊరేగే ఊహలే ఆపడం నా తరమా

నీలి మేఘమా.. అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 

ప్రతీ మలుపులోనూ తనే కొలువయిందీ
ఒకో జ్ఞాపకన్నీ నాకే పంచుతోందీ
ఆ ఏటి గట్టూ అల పాదాలతోటీ .. 
ఈ గుండె గదిని తడి గురుతు చూపుతుందీ
ఆ నదులూ .. విరిసే పొదలూ .. 
నా ఎదకూ ఆమెనే చూపినవి

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా

మదే కనని పాశం ఇలా ఎదురయిందా
తనే లోకమన్నా ప్రేమే నవ్వుకుందా
ఈ ఇంటిలోని అనుబంధాలు చూసీ.. 
నా కంటిపాపే కరిగింది ముచ్చటేసి 
ఈ జతలో.. ఒకడై ఒదిగే.. 
ఓ వరమే చాలదా ఎన్నటికీ

నీలి మేఘమా ..అంత వేగమా
ఓ నిముషం ఆగుమా.. 
నేలకీ రంగులు నీ వరమా 
 

శనివారం, మే 03, 2014

మరువకుమా అనురాగం...

ఒకప్పుడు దూరదర్శన్ లో వచ్చే చిత్రలహరిలో తరచూ కనిపించే పాట ఇది. నాకు చాలా ఇష్టమైన పాట. ఇందులో శోభన్ బాబు మఫ్లర్ ఇలా స్టైల్ గా వేసుకుని నడుస్తూ వస్తూండడం చూస్తే అప్పట్లో మనకి పిచ్చి ఫాసినేషన్. నాన్నగారి మఫ్లర్ తీస్కుని ఎవరూ చూడకుండా నేనూ తెగ ప్రాక్టీస్ చేసేవాడ్ని :-) ఈ చక్కని పాట  మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : జీవన పోరాటం (1986)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

హా.. హా.. హా.. హా.. ఆ హాహహా..హా
హా.. హా.. హా .. హా.. ఆ ఆ ఆ..హా

మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
ఈ.. మధుమాసం .. మనకోసం
ప్రేమ పల్లవించి పూలు పూసే కౌగిలింతలో

సంతకాలు చేసిపోయే జీవితాలలో
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..

మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం

ఆమని తేనెలు పొంగే వేళల్లో...ప్రేమని కోయిల పాడే వేళల్లో
పూవే..గంధాలు పూసి.. నాలో ప్రాణాలు పోసి
కుంకుమ వీణల సంధ్యా రాగమే.. పండిన ప్రేమకు తాంబూలమై
మూగచూపులల్లుకుంది రాగమెప్పుడో..
కన్నె గుండె చేరుకుందీ తాళమెప్పుడో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..

మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం

రేపటి చల్లటి వెలుగు నీడల్లో.. నిన్నటి సన్నటి వెన్నెల జాడల్లో
నీవే.. నేనైనా వేళా.. మాటే.. మూగైన వేళా
తోటకి వేసవి రానే రాదులే.. పాటా.. పల్లవి.. నీవూ నేనులే
జాజిపూల మాలలంటి జ్ఞాపకాలలో..
పూవులార బోసుకున్న జీవితాలలో..
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..

మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
ఈ.. మధుమాసం .. మనకోసం
ప్రేమ పల్లవించి పూలు పూసే కౌగిలింతలో
సంతకాలు చేసిపోయే జీవితాలలో
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..

మరువకుమా అనురాగం.. మనుగడలో మకరందం
హా.. హా.. హా.. హా.. ఆ హాహహా..హా
హా.. హా.. హా .. హా.. ఆ ఆ ఆ..హా 


శుక్రవారం, మే 02, 2014

ఓసి మనసా నీకు తెలుసా...

నేటి సిద్దార్ధ చిత్రంలో నాకు నచ్చిన ఓ మంచి మెలోడీ... లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం కావడంతో, తొంభైలలో హిందీ చిత్రసీమలో అపుడపుడే ఫేమస్ అవుతున్న ఝంకార్ బీట్స్ తరహా గోల కాస్త మధ్యమధ్యలో మెరిసి మాయమయినా ఓవరాల్ గా పాట వినడానికి బాగుంటుంది. మీరూ చూసి విని ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 



చిత్రం : నేటి సిధ్ధార్థ (1990)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఆ ఆ ఆ...
ఓ ఓ ఆ ఆ లలల లాలల లాలలా....
ఓసి మనసా... నీకు తెలుసా...
మూగకనులా... ఈ గుసగుసా...
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
తనువంతా వేణువూదింది కన్నె ఊపిరి
ఈ లావాదేవీ ఏనాటిదీ
ఓఓ హో హో ....

ఓసి వయసా ... ఇంత అలుసా.....
నీకు తగునా.... ఈ గుసగుసా.....
మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ గిల్లీకజ్జా ఏనాటిదీ ...ఓహొహో హో....

ఓసి మనసా... నీకు తెలుసా....

నింగీ నేలా వంగీపొంగీ సయ్యాటాడే ఎందుకోసమో
చూపులో సూర్యుడే పండినా సందెలో
కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో
ఏటిలో వీణలే పాడినా చిందులో
తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో
కసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకే
సిరితీగ పాప ఉగేది తీపి కాటుకే
అహా ప్రేమో ఏమో ఈలాహిరీ... ఓహొహో హో..హహహ..

ఓసి వయసా ... ఇంత అలుసా.....

తుళ్ళి తుళ్ళి తూనీగాడె పూతీగల్లో ఎందుకోసమో
గాలిలో ఈలలా పూలలో తావిలా
హొయ్ మల్లీ జాజీ మందారాల పుప్పొళ్ళాడే ఏమి మాసమో
కొమ్మలో కోయిలా రాగమే తీయగా
ఒడిలో అలజడులే పెరిగే వేళలో
కనుపాపలాడుకుంటాయి కౌగిలింతల్లో
చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో
ఈడొచ్చాకా ఇంతేమరీ.. ఆహహాహా..హహహ...

ఓసి మనసా .... నీకు తెలుసా....హో
నీకు తగునా.... ఈ గుసగుసా.....
ఎదలోయల్లోన సాగింది కొత్త తాకిడి
మసకేసే ముందే సాగిందీ గుండె దోపిడి
ఈ లావాదేవీ ఏనాటిదీ
ఓహొహో హో.....

ఓసి వయసా ... ఇంత అలుసా...
ఓసి మనసా .... నీకు తెలుసా.... 
 

గురువారం, మే 01, 2014

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో

పాట టైటిల్ చూడగానే దానికి అల్లుకున్న కొన్ని సీన్లు గుర్తొచ్చి గిలిగింతలు పెట్టి, ఆపై సినిమా గుర్తొచ్చి గుబులు పుట్టి, ఆపై అర్జంటుగా సినిమా చూడడం మొదలెట్టి ఉదయాన్నే చక్కబెట్టేద్దాం అనుకున్న పనులు పక్కనెట్టేసినందుకు మీ జీవిత భాగస్వామి చేతిలోనో అమ్మానాన్నల చేతిలోనో మొట్టికాయలు తింటే మాత్రం నా పూచీలేదండీ ముందే చెప్పేస్తున్నాను. ఎలాగూ మనలో కొంతమందికి శలవే కదా అని చెప్పి ఇపుడీ సినిమా గుర్తుచేసే పని పెట్టుకున్నాననమాట. ఈ కమ్మనైన పాట చూసీ వినీ కాసేపు మురిసి ముసి ముసి నవ్వులు నవ్వుకోవడం మాత్రం మరువకండేం :-) ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.



చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల, బాలు

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

ఓ... అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావో
ఆ... చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావో
ఎందా??
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వీదువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జెడ బా...రెడూ
మనసిలాయో...

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

ఆఆఅ..హా హా హా...
ఆఆఆఆ...
 లా లా లా...
హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి..
అదేవిటి... ??
ఓ...గుటకలు చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసూ
గుటకలు.. చిటికెలు.. కిటుకులు.. ఏమిటి సంగతి??
ఆ..కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులూ
మనసిలాయో...

కిట్టమూర్తీ కిట్టమూర్తీ మనసిలాయో
మనసిలాయో మనసిలాయో ... అమ్ముకుట్టి

తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
గసరిదమ పాదపమగరి నిగమప దపమగ పమగరి గరిసని
ఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే
తిరుఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే

గుండెల్లోన గుబగుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళూ
పరవశమైనా మా శ్రీవారికి పగ్గాల్లేనీ పరవళ్ళూ
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...

అక్కడ తమకూ ఇక్కడ మనకూ విరహంలోనా వెక్కిళ్ళు
మనసిలాయో...

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ 
 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.