గురువారం, ఫిబ్రవరి 20, 2014

డ్రీమ్ గర్ల్..

సిరివెన్నెల అంటే క్లాసికల్ పాటలనే కాదు ఇలాంటి అల్లరి పాటలను సైతం తెలుగు ఇంగ్లీష్ కలిపి కూడా అందంగా రాయగలరు ఆకట్టుకోగలరు అని నిరూపించిన పాట. కృష్ణవంశీ మొదటి మాజిక్ "గులాబి" నుండి. శశిప్రీతమ్ అప్పట్లో గొప్ప యూత్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని మాకాలేజ్ లో అందరం ఫిక్స్ అయిపోయాం కానీ ఎందుకో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎపుడు విన్నా నా కాలేజ్ రోజులని గుర్తు చేసే ఈ పాటని మీరూ విని ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : గులాబి(1996)
సంగీతం : శశి ప్రీతం
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుచిత్రాక్రిష్ణమూర్తి, సురేష్ పీటర్స్ 

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె 
అందమైన అమ్మాయిరోయ్
రమ్యకృష్ణ రూపాన్ని చిత్ర లోని రాగాన్ని 
కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరురా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది..
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ మెడలో మాల వేసే డార్లింగ్ డాల్..

లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా..
హెల్లో హనీ వెల్కమ్ అనీ అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మాలి నా మాటనీ తగ్గించు అల్లర్లనీ

డ్రీమ్ గర్ల్ గుండెల్లో మోగే టెంపుల్ బెల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

ఊహూ..హు.హు.హు..తూరూ.రూ.రూ.రూ..
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారినీ
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ

డ్రీమ్ గర్ల్
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు హనీబి
ఎక్కడుందొ ఆ బేబీ
కొంటె ఊసులాడింది హార్టు బీటు పెంచింది 
ఎమిటంట దాని హాబీ..

వాట్ ఈజ్ దిస్...వంకాయ్ పుల్స్
నో అడ్రస్.. మిస్ యూనివర్స్.. మెంటల్ కేస్..
అంతెలేర బాసు.. మే గాడ్ బ్లెస్ యూ..

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

డ్రీమ్ గర్ల్ నిన్నే తలచుకొంటే నిద్దర నిల్..
డ్రీమ్ గర్ల్ మనసే తడిసిపోయే వాటర్ ఫాల్..
డ్రీమ్ గర్ల్ త్వరగా చేరుకోవే మై డార్లింగ్..
డ్రీమ్ గర్ల్ ఇంకా ఎంతకాలం ఈ వెయిటింగ్..
డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్..
హేయ్.. మై డ్రీమ్ గర్ల్
డ్రీమ్ గర్ల్
 

బుధవారం, ఫిబ్రవరి 19, 2014

తప్పట్లోయ్ తాళాలోయ్..

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము నువ్వూ
విశ్వనాథ్ గారి లేటెస్ట్ సినిమా శుభప్రదంలో ఈ పాట చాలా బాగుంటుంది, శివకేశవులు ఒకటేనంటూ పోలికలు చూపే ప్రయత్నం చేసిన చరణం కానీ పల్లవిలోని వాక్యాలు కానీ చక్కని సాహిత్యం, ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఒకప్పటి విశ్వనాథ్ సినిమాలతో పోల్చలేకపోయినా ఈకాలం స్టాండర్డ్స్ కి చక్కని సంగీత సాహిత్యాల మేళవింపే. రౌతుకొద్దీ గుర్రమనే సామెత మోటుగా ఉన్నా దర్శకుడిని బట్టే పాటల రచయిత ప్రతిభ అని ఈపాటతో మరోసారి రుజువైంది. సేమ్యా ఉప్మా చైనీస్ నూడుల్స్ అంటూ పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రిగారితో విశ్వనాథ్ గారు ఎంతచక్కని పాట రాయించుకున్నారో మీరే చూడండి. ఈ అందమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శుభప్రదం(2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చైత్ర, ఫిమేల్ కోరస్, మేల్ కోరస్

తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే దిగుతకతై..
తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే తకతకతారే..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్
నలుదిక్కుల చీకటినంతా 
తన మేనిలొ దాచిన వింతా
కడువిందుగా వెలుగులు 
చిందెను మా కన్నుల్లో
ఆనంద ముకుందుని చేతా 
ఆంతర్యము అణువణువంతా
మధునందనమాయెను 
తన్మయ తారంగంలో..ఓఓ..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా 
మధురాపురి సదనా 
మృదువదనా మధుసూదనా...

తలపైనా కన్నున్న ముక్కంటి తానేగా 
శివమూర్తి శిఖిపించ మౌళీ
ప్రాణాలు వెలిగించు ప్రాణవార్ధమేగా 
తన మోవి మురళీస్వరాళి
భవుని మేని ధూళీ 
తలపించదా వనమధూళీ
ప్రమాధగణ విరాగీ 
యదుకాంతులకు ప్రియవిరాళీ
ఝనన ఝనన పదయుగళమె 
జతపడి శివకేశవా భేదకేళీ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

హొయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..
తయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..

ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నేను
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నేను
చెలిమికోరే ..ఏ.ఎ.ఎ.ఏఏ.. 
చెలిమికోరే గోపెమ్మలా 
చేతవెన్నముద్ద నేను
నన్ను కోరే ఎవ్వరికైనా 
బంధుగోవిందుడనౌతానూ  
ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నువ్వూ
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నువ్వూ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్. 
ముద్దుగోరే రాధమ్మ సందిట చెంగల్వ పూదండ నువ్వూ

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

నీతో ఏదో అందామనిపిస్తుంది

కృష్ణవంశీ సిరివెన్నెల కాంబినేషన్ లో సాయికార్తీక్ సంగీత దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన మరో మంచి మెలోడి ఇది, సిరివెన్నెల తనమాజిక్ చూపించేస్తే కృష్ణవంశీ తన ఓల్డ్ స్టైల్లో చిత్రించిన చిత్రీకరణ సైతం ఆకట్టుకుంటుంది. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ వీడియో ఒక నిముషం ప్రోమోషనల్ వీడియో మాత్రమే. యూట్యూబ్ లో ఫోటోలు ప్లస్ పూర్తిపాట ఆడియోతో చేసిన ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు లేదా ఆడియో మాత్రమే రాగాలో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్వేత మోహన్, సాయి కార్తీక్
 
హీరోసే..మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 


హో... హో.... ఓ... ఓ...
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...
నా పుట్టుక నీతో మొదలైంది...
నీతోనే పూర్తయిపోతోంది...
ఇంకెలా చెప్పనూ మాటల్లో వివరించి
నీకెలా చూపనూ నా మనసింతకు మించి
 
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి 

 
కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికిపో అంటే సాయంత్రం అనుకుంటా..
నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగ ఉంటుందే
 

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 

తెలియని దిగులౌతుంటే నిను తలచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తోందే ఆ గుబులూ
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టొళ్ళంతా ఘుమఘుమలూ
బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకోని
 
హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...

నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది.

సోమవారం, ఫిబ్రవరి 17, 2014

ఉయ్యాలైనా జంపాలైనా

కొత్త దర్శకులనుండీ కొత్త సంగీత దర్శకులనుండి మంచి పాటలు ఆశించడం ఎపుడో మానేసిన నాకు ఇటీవల విడుదలైన ఉయ్యాల జంపాల లోని ఈపాట బాగా నచ్చింది, సీతారాములని మళ్ళీ మనలా పుట్టించాడు అని అనుకోవడం ఆ తర్వాత సాహిత్యంలో వాసు వలభోజు ఉపయోగించిన చక్కని తెలుగు చూస్తే ఈ టీమ్ నుండి మరిన్ని మంచి పాటలు ఆశించవచ్చునేమో అనిపించింది, సన్నీ మ్యూజిక్ కూడా చాలా సూతింగ్ గా ఉంది. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. అలాగే ఎంబెడ్ చేసిన వీడియో ముప్పై సెకన్ల ప్రోమో మాత్రమే పూర్తిపాట లిరిక్స్ తో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం : సన్నీ M.R
రచన : వాసు వలబోజు
గానం : హర్షిక గుడి, అనుదీప్ దేవ్

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో... నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో... నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. 
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్.. 

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలామారి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించని

ఎటువైపు చూస్తున్న 
నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా 

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం

ఆదివారం, ఫిబ్రవరి 16, 2014

వేవేలా వర్ణాలా

కొన్నేళ్ళ క్రితం ఓసారి ఈ పాట వింటూ టైప్ చేసుకున్నపుడు నేను రాసుకున్న మాటలు "ఈ మధ్య కాలం లో ఇంత ఆస్వాదిస్తూ రాసుకున్న పాట లేదు... ఆ తన్మయత్వం లో సిరివెన్నెల గారిని ఏమని పొగడాలో కూడా తెలియడం లేదు..." నేటికీ ఈ పాట వింటున్నపుడు నాలో అవే ఫీలింగ్స్... ఈ సినిమాలోని ప్రతిపాట నాకు చాలా ఇష్టమైనా ఈ పాట మరింత ఎక్కువ ఇష్టం. సిరివెన్నెల, ఇళయరాజా, బాలు, గీతాకృష్ణలు కలిసి చేసిన మాజిక్ మీరూ చూసి విని ఆనందించండి. ఆడియోమాత్రం కావాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సంకీర్తన
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలూ, కౌసల్య(సీనియర్ లీడ్ కోరస్ సింగర్)

ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
వేవేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతాలై...

వేవేలా వర్ణాలా... ఈ నేలా కావ్యాలా...

ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే...
ఓ...తల్లీ గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి
పల్లె పల్లె పచ్చాని పందిరీ...పల్లె పల్లె పచ్చాని పందిరీ...
నిండూ నూరేళ్ళు పండు ముత్తైదువల్లె వుండు
పంటా లచ్చిమి సందడీ...పంట పంటా లచ్చిమి సందడీ...
తందైన..తందతైన..తందైన..తందతైన..
తందైన..తందతయ్యనా.. తయ్య..తందైన..తందతయ్యనా..

వాన వేలి తోటీ నేల వీణ మీటే...
నీలి నింగి పాటే.. ఈ చేలటా...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న..
కమ్మనైన కవితలే ఈ పూలటా...
ప్రతి కదలికలో నాట్యమె కాదా..
ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా..
ఎదకే కనులుంటే....

వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతా లై...
వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
లాలలా...ఆ అ ఆ...
లాలలా...ఆ అ ఆ...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలటా..


కోరస్ పాడిన గాయణీమణి గురించి పాడుతాతీయగా లో బాలుగారు చెప్పారంటూ శ్రమతో లింక్ వెతికి ఇచ్చిన మిత్రులు నెమలికన్నుమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

శనివారం, ఫిబ్రవరి 15, 2014

ముద్దుల జానకి పెళ్ళికి

నిన్నటిదాకా ప్రేమ గీతాలలో ఓలలాడాముగా ఇక తర్వాతేముంటుంది పెళ్ళే మరి :-) పెద్దరికం సినిమాలోని ఈ పెళ్ళిపాట నాకు చాలా ఇష్టం. నిజానికి దీనిని పెళ్ళి ఏర్పాట్ల పాట అని చెప్పాలేమో, చిత్రీకరణ చాలా బాగుంటుంది అచ్చ తెలుగమ్మాయిగా సుకన్య తనకు బామ్మగారిగా భానుమతి గారు కూడా బాగుంటారు. ఈ చక్కని పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర, వడ్డేపల్లి కృష్ణ
గానం : చిత్ర, కోరస్

ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ....
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తొలకరిలా వలపంతా కురిసెనులే 
తీయని ఊహలు చిగురు తొడిగెను

నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసీ
నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే

వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే

కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున 
ఒంపుల సొంపుల సరిగమ వినిపించే

ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
 

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ...

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...
గత నెలరోజులుగా బోలెడు ప్రేమ గీతాలని చూస్తూ వింటూ రోజంతా ప్రేమమయం చేసుకుంటూ ఆనందంగా గడిపాము కదా మరి ఈ రోజు ప్రేమికులరోజు సంధర్బంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు :-) ఈ ప్రత్యేకమైన రోజు తెలుగు సినీ ప్రపంచంలో మూడు తరాలకు చెందిన మూడు ప్రేమ పాటలను మీతో పంచుకుందామని తీసుకు వచ్చేశాను. 

సంతానం సినిమా కోసం ఘంటసాల గారు పాడిన ఈ "చల్లని వెన్నెలలో" పాట చాలా బాగుంటుంది, ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే ఆలాపన వింటూంటే నిజ్జంగా చల్లని వెన్నెలలో తిరుగుతున్న అనుభూతిని ఇస్తుంది, సుసర్ల దక్షిణామూర్తి గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ అందమైన పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : అనిశెట్టి 
గానం : ఘంటసాల 

ఆఆఅ..ఆఆ..ఆఆఆఆఆ...ఆఆఆఆ
చల్లని వెన్నెలలో... చల్లని వెన్నెలలో..ఓఓఓ..
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో... 

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
గాలిపెదవులే మెల్లగ సోకిన
గాలిపెదవులే మెల్లగ సోకిన 
పూలు నవ్వెనే నిద్దురలో..హో..ఓఓ..

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో...

కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓఓ..ఓఓ..
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము
కలకాలము నీ కమ్మని రూపము..
కలవరింతులే నా మదిలో..ఓఓ..ఓఓ.

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో...

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ప్రేమపాటలను చిత్రీకరించడంలో కృష్ణవంశీది ఒక ప్రత్యేకమైన శైలి అలాంటిది ఆ పాటకు సిరివెన్నెల గారి సాహిత్యం తోడైతే ఆ పాట చూస్తూ వింటూ తన కలల రాకుమారిని/రాకుమారుడిని తలచుకోని వ్యక్తి ఉండరనుకోవడంలో అతిశయోక్తి లేదేమో. నిన్నేపెళ్ళాడతా సినిమా లో టాబు,నాగర్జున నటించిన ఈ చక్కని ప్రేమ గీతాన్ని మీరూ చూసి/విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సంజీవ్, సుజాత

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే


మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా  

నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 

 అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనం  
 కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 


గౌతమ్ మీనన్ ప్రేమకథా చిత్రాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈకాలం ప్రేమలను ఇతనంతబాగా ఎవరూ అర్ధంచేస్కోలేరేమో అనిపిస్తుంటుంది పైగా దర్శకుడికన్నా ముందు అతనో సినిమాటోగ్రాఫర్ అవడం వలనో ఏమో తన చిత్రాలన్నీ చూడ్డానికి కావ్యాల్లా కనిపిస్తాయి నాకు. సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ లో సూర్య మేఘనా కి ప్రపోజ్ చేసే ఈ సీన్ నాకు చాలా ఇష్టం దానివెంటనే వచ్చే ఈ పాట కూడా నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి. హారీస్ మ్యూజిక్ వేటూరి గారి సాహిత్యం ఈపాటని మర్చిపోనివ్వవు. చిత్రీకరణ కూడా బాగుంటుంది సమీరా కూడా అందంగా ఉంటుందనమాట అని అనిపించే చిత్రీకరణ గౌతమ్ కే సాధ్యం :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం : హరీస్ జయరాజ్
సాహిత్యం : వేటూరి 
గానం : హరీష్ రాఘవేంద్ర, దేవన్, V. ప్రసన్న 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా  
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా 
ఓ శాంతీ శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే.. 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
  

ఆఅహ్హ్హా... హ్హ్.హ్.హ్.ఆ..

 ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివర మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయి ముసినవ్వా బోగన్ విల్లా..
నువ్వు నిలిచిన చోటేదో వెలయెంత పలికేను
నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యేను!
నాతోటి రా.. ఇంటి వరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరొ తెలియకనే
ఆ వెనెకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏం మాయో
నా మనసే నీకు వశమాయే.. వశమాయే.. 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా..ఓఓ.. 
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా
 

కంటి నిద్రే దోచుకెళ్ళావ్ ఆశలన్నీ చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతూవుంటే వీచే గాలీ దిశలు మారు
ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవ ఏనాడు
కౌగిలింతే కోరలేదు
కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే..
నను తలచే నిముషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.. ఏఏ..

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
  
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా
  

ఓ శాంతీ శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే..
 
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

గురువారం, ఫిబ్రవరి 13, 2014

నాలో ఊహలకు / నాలో నేనేనా..

నిన్న తొంభైలలో పాటలు విన్నారు కదా ఇంకో ఇరవై ఏళ్ళు ముందుకు వస్తే ప్రస్తుత కాలంలో వస్తున్న పాటలలో ఈ రెండు పాటలూ చాలా బాగుంటాయ్. ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన కె.ఎమ్.రాధాకృష్ణ స్వరకల్పనలో వచ్చిన ఈ పాటకు ఆషా భోంస్లే స్వరం ప్లస్ తన ఉచ్చారణే ఒక సొగసును అద్దాయి అనిపిస్తుంది. తెలుగు భాషాప్రేమికులకు ఈ మాటలు మింగుడు పడకపోవచ్చు కానీ కాజల్ కు ఈ వైవిధ్యమైన స్వరంతో ఇలా పాడడం చాలా చక్కగా సూట్ అయిందని నా అభిప్రాయం. ఈపాట చిత్రీకరణ కూడా కృష్ణవంశీ శైలిలో చాలాబాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ 
సాహిత్యం : అనంత శ్రీరామ్ 
గానం : ఆషా భోంస్లే, కె.ఎం. రాధాకృష్ణన్

ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
తరికిటతోం తనకధీం తంగిట తరికటతక
తానిదానిదా తానిదానిదా
గమద సనిద ఆ...
ధీం తనక ధీం తకిటతక ధీం తనక ధీం
ఆ ఆ ఆ ఆ ఆ
సనిసస నినిస నిస ససనిసస నినిసస నిస

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ.. పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ససనిపస ససనిపరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ రారెరెరాఆ..
కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే
పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే
శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా ఆ ఆ

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

ఆ ఆ ఆ ఆ ఆ
గరిగ మమగ గరిగ మమగరిసని
తరికిటతోం తరికిటతోం
తరికిటతోం తరికిటతోం
తరికిటతరికిటతోం తరికిటతరికిటతోం తరికిటతోం
ఆ ఆ ఆ ఆ రారెరెరాఅ..ఆఅ..
మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ
మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ
నిన్ను చూస్తూ ఆవిరౌతూ అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు
పరుగులుగా ఆఆ... పరుగులుగా అవే ఇలా
ఇవ్వాళ నిన్నే చేరాయి
నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

మణిశర్మ స్వరసారధ్యంలో అభిరుచి ఉన్న దర్శకుడు చైతన్య దర్శకత్వంలో వచ్చిన బాణం చిత్రంలోని "నాలో నేనేనా.." పాట కొత్తపాటలలో ది బెస్ట్ పాట, చాలా బాగుంటుంది. సోలో లాగా అనిపించే ఈ డ్యూయెట్ ని మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఈ పాట గురించి గతంలో సినిమా విడుదలైనపుడు నేను రాసుకున్న టపా ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : బాణం(2009)
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

ఔనూ కాదు తడబాటునీ.. 
అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ.. 
పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..


నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

దైవం వరమై దొరికిందనీ
నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ 
చిగురై పోనీ శిశిరాన్నీ..
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలూ..
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా..
మనమే సాక్ష్యం... మాటే మంత్రం
ప్రేమే.. బంధం..

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

బుధవారం, ఫిబ్రవరి 12, 2014

నిన్న ఈ కలవరింత / ఊసులాడే ఒక జాబిలట

నిన్న ఒకప్పటి ప్రేమగీతాలెలా ఉండేవో విన్నారు కదా.. కొన్నేళ్ళు ముందుకు వస్తే డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు ఈ నెలరోజుల్లోనూ చాలా వినేశాం కనుక తొంభైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో ఈ రోజు చూద్దాం. ఈ అమ్మాయికి కొత్త కలవరింత ఏదో కలిగిందట దానినే ప్రేమ అని ఎలా గుర్తించిందో మీరే చూడండి. రహమాన్ కెరీర్ మొదట్లో స్వరపరచిన ఈ పద్మవ్యూహం సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి. ప్రేమ గురించి చెప్పే ఈ పాట మరి కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హారిక

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...

దైవం ఉందంటినీ అమ్మనెరిగాకనే.. 
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం.. 
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే 
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే 
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా... 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే బొత్తిగా నెమ్మదస్తుడు, మౌనంగా ప్రేయసిని ఆరాధించడమే తప్ప ఎన్నడూ ఆమెకు కూడా తనమనసులో మాట చెప్పి ఎరుగడు. అలాటిది స్టేజ్ పై పాట పాడవలసిన అవసరం వచ్చింది, అంతలో ఎదురుగా ప్రేయసి సాక్షత్కరించింది ఇకనేం గుండెలో గూడుకట్టుకున్న ప్రేమనంతా పాటగా మార్చి ప్రేయసి మనసునే కాదు స్టూడెంట్స్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇళయరాజా గారి స్వరకల్పనలో రాజశ్రీ గారు రాసిన ఈ పాట అప్పట్లో కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన పాట, మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం: హృదయం (1992)  
 సంగీతం : ఇళయరాజా
 సాహిత్యం :రాజశ్రీ
గానం : బాలు

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట 

 ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట


అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేనూ జపించేను రోజూ
ననే చూసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!
 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

 
నాలో నువు రేగే నీ పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో..


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం!


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

అందాలే చిందే చెలి రూపం నా కోసం

మంగళవారం, ఫిబ్రవరి 11, 2014

వినిపించని రాగాలే / నీలి మేఘమాలవో

తరాలు ఎన్ని మారినా సినిమా తీయడంలో నైపుణ్యత ఎంత మారినా ఎన్ని కొత్త టెక్నాలజీలు అందుబాటులో కొచ్చినా మారనిది ప్రేమ ఒకటే. నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు ఆ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కొత్త ప్రేమకథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి, వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఒకనాటి ప్రేమ గీతాలు అంటే మరీ సినిమా మొదలైన ముప్పై, నలభైలలో కాకున్నా అరవైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో మచ్చుకి ఈ రెండు పాటలలో చూడండి. "వినిపించని రాగాలే కనిపించని అందాలే" అంటూ కథానాయిక ప్రేమ గురించి ఎంత అందంగా పాడుతుందో మీరూ చూసి విని ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం:  సుశీల

ఓహో..ఓ...ఓ...ఆహాఅ..ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే.. ఏ ఏ...

తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు

వినిపించని రాగాలే ఏ ఏ...
వలపే వసంతములా పులకించి పూచినది
వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసు

వినిపించని రాగాలే..ఏఏ...
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
 
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే ఏఏ..

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఇది ఒక ప్రియుడు తన ప్రేయసిని తలచుకుంటూ పాడుతున్న మధురగీతం. ఫేమస్ "చౌద్వీకా చాంద్" కు తెలుగు రీమేక్, సంగీతం సాలూరు వారో రాజన్-నాగేంద్ర గారో చిన్న సంశయం ఉంది ఐతే పి.బి.శ్రీనివాస్ గారి గళం మాత్రం చాలా చాలా చక్కగా అమరింది. చిత్రీకరణ కాస్త నిరాశపరిచింది కానీ వినడానికి మాత్ర్రం ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మదనకామరాజు కథ(1962)
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
సంగీతం : సాలూరు రాజేశ్వర రావు / రాజన్-నాగేంద్ర
గానం : పీ బీ శ్రీనివాస్

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో 

 నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో

నీ మోములోన జాబిలి దోబూచులాడెనే
నీ కురులు తేలి గాలిలో ఉయ్యాలలూగెనే
నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో
 
నీలి మేఘమాలవో..ఓఓ...
నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే
నీ వలపు తనివి తీరని మధురాల రావమే
నిలచేవదేల నా పిలుపు ఆలకించవో
 
నీలి మేఘమాలవో..ఓఓ..

రాదేల జాలి ఓ చెలీ ఈ మౌనమేలనే
రాగాల తేలిపోదమే జాగేల చాలునే
రావో యుగాల ప్రేయసీ నన్నాదరించవో

నీలి మేఘమాలవో నీలాల తారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో...

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.