గురువారం, మార్చి 09, 2017

ఒకసారి ఆగుమా...

బండరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బండరాముడు (1959) 
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి / కె ప్రసాదరావు
సాహిత్యం : 
గానం : పి.సుశీల

సాగిపోయే ఓ చందమామా 
ఆగుమా.. ఒకసారి ఆగుమా..
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా

ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా ఓ చందమామ 
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
నీలి మబ్బుల తెర చాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ
యెదలోన నీవైన శోధించుకొమ్మా

ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా ఓ చందమామ

పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పూటను ఇలు వీడలేడోయ్
పరుల సొమ్మును హరియించు వాడే
పగటి పూటను ఇలు వీడలేడోయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి
మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా 

ఒక సారి ఆగుమా.. 
ఒకసారి ఆగుమా ఓ చందమామ
మనసార నా మాట ఆలించిపొమ్మా
 మారేన నీ మనసు ఓ చందమామ
మారేన నీ మనసు ఓ చందమామ
ఓ చందమామ ఓ చందమామ

 

2 comments:

చందమామే చందమామని పిలిచినట్టుంది..

మాబాగా చెప్పారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.