మనుషులు మమతలు చిత్రంలోని ఒక గ"మ్మత్తైన" పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనుషులు మమతలు (1965)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల
నిన్ను చూడనీ... నన్ను పాడనీ....
ఇలా వుండిపోనీ నీ చెంతనే...
నిన్ను చూడనీ....
ఈ కనులు నీకే .. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే.. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలా వుండిపోనీ నీ దాసినై..
నిన్ను చూడనీ... నన్ను పాడనీ...
నిన్ను చూడనీ...
నీవు లేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలా రాలిపోనీ నీ కోసమే..
నిన్ను చూడనీ.. నన్ను పాడనీ
నిన్ను చూడనీ
2 comments:
కళ్ళతోనే నవరసాలూ పలికించగల సావిత్రిగారు..హాట్సాఫ్..
అవునండీ గ్రేట్ యాక్ట్రెస్... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.