తిక్కశంకరయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తిక్క శంకరయ్య (1968)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల
కోవెల ఎరుగని దేవుడు కలడని
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
పలికే జాబిలి ఇలపై కలదని
పలికే జాబిలి ఇలపై కలదని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
కన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా
కన్నీట తపియించినాను
నీ రాకతో... నీ మాటతో...
నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల పులకించినాను
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
ఇన్నాళ్ళుగా విరజాజిలా
ఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలా
ఈ కోనలో దాగినావు
ఈ వేళలో... నీవేలనో
నాలోన విరబూసినావు
నాలోన విరబూసినావు...
పలికే జాబిలి.. ఇలపై కలదని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
కోవెల ఎరుగని దేవుడు కలడని
అనుకొంటినా నేను ఏనాడు
కనుగొంటి కనుగొంటి ఈనాడు
ఆహ...హ...ఆహా...హా...
ఊ...ఊ..ఉం...
2 comments:
ఈ పాట యెప్పుడు విన్నా మనసుకి చాలా హాయిగా ఉంటుంది..
అవునండీ చాలా మంచి పాట... థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.