అఖండుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అఖండుడు (1970)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్, సుశీల
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
నను కాపాడిన చేతులలోనే
వాలెదనంటే ఈ బిగువేలా
నను కాపాడిన చేతులలోనే
వాలెదనంటే ఈ బిగువేలా
మగువే తానే వలచిన వేళా
మగవారి బింకాలన్నీ ఇంతేనా
రా రా రమ్మంటే రావాలా
పొమ్మంటే పోవాలా
నీ మాటే సాగాలా.
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
పలుకులతోనే వలపులు కురిసీ
చూపులలోనే కోపం మెరిసే
నిలకడలేని చెలియల తీరు
దివినుండే దేవునికైనా తెలియదులే
రా రా రమ్మంటే రావాలా
పొమ్మంటే పోవాలా
నీ మాటే సాగాలా.
యవ్వనమంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసి
యవ్వనమంతా దోసిట నింపి
జీవితమే ఒక కానుక జేసి
నీవే నీవే నా సర్వమనీ
నీకోసం వేచితినోయీ రావోయీ
రారా రమ్మంటే రావేల
నీకింత బెదురేలా
ఒంటరిగా ఉన్నారా..
2 comments:
ఇంత ప్రేమగా పిలుస్తుంటే కాదనే అబ్బాయుంటాడా అసలు..
ఉన్నాడనేకదండీ పాపం ఆ హీరోయిన్ బాధ.. :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.