గురువారం, మార్చి 30, 2017

విన్నానులే...

ప్రేమలేఖలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆరుద్ర
గానం : రామకృష్ణ, సుశీల

విన్నానులే.. ఊహుహు
పొంచి విన్నానులే.. ఏమని
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

ఉహూహూ హూ హూ
అహాహా ఆ ఆ ఆ ఆ

సుకుమారివి నువ్వు పువ్వులాంటి నువ్వు
పండులాంటి పాపాయిని ఇవ్వు
ఊ ఊ... ఆ ఆ ...
అలసిపోనివ్వను పనులు చేయనివ్వను
అడుగుతీసి అడుగు వేయనివ్వను

ఓహో ఇంటి పనులు వంట పనులు తమరే చేస్తే...
అయ్యగారి ఉద్యోగం ఊహుహుహుహు..

హహహహ..విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయే నాన్న అవుతాడనీ

పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా ఆ ఆ....
పాపాయే గారాల తోట
మన చిన్నారే నా ముద్దుల మూటా..

అయ్యగారివైపు పడదు నీ చూపు
ఇక ముద్దులన్ని పాపకేన రేపు

అరే అంతలోనే వచ్చిందా తమకు అసూయా
అబ్బాయి తమ పోలిక ఆ ముద్దులు మీకే

విన్నానులే.. పొంచి విన్నానులే
ఒక అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయి నాన్న అవుతాడనీ

తొలి చూలి భాగ్యం ఎంతో ఆనందం
విడిపోని అనురాగబంధం
ఆ ఆ ఆ ఆ...
నిజమైన స్వప్నం దిగి వచ్చిన స్వర్గం
పాపాయే మన ఆరోప్రాణం

నవ్వులతో వెలుగులతో నిండును ఇల్లు
పాపాయి మురిపాలే తొలకరి జల్లు

విన్నావులే.. ఊహుహు
పొంచి విన్నావులే.. ఏమని
ఈ అమ్మాయి అమ్మ అవుతుందనీ
ఈ అబ్బాయి నాన్న అవుతాడనీ


2 comments:

ఈ మూవీ లోనే ఈరోజు-మంచిరోజు అనే పాట కూడా చాలా బావుంటుందండీ..

అవునండీ.. ఆ పాట ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇదిగోండి లింక్ https://sarigamalagalagalalu.blogspot.in/2016/04/blog-post_28.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.