శుక్రవారం, మార్చి 24, 2017

తెలియని ఆనందం...

మాంగల్య బలం చిత్రంలోని ఒక చక్కనైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం :  శ్రీశ్రీ
గానం :  సుశీల

ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము

తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..

పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...


2 comments:

శ్రీశ్రీ వారి కలం నించి జాలువారిన మధుర గీతాలలో ఒకటి..

అవునండీ శ్రీశ్రీ గారు రాసిన కొన్ని పాటలు బావుంటాయ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.