అంతులేని కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అంతులేని కథ (1976)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
నాలో ఉన్న మనసూ
నాకు గాక ఇంకెవరికి తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసు
నాకు గాక ఇంకెవరికి తెలుసు
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ
నాలో ఉన్న మనసు
నాకు గాక ఇంకెవరికి తెలుసూ
2 comments:
అమ్మాయి మనసుకి అద్దం పట్టే పాట..
అవునండీ.. ఎంతైనా మనసు కవి గారు వ్రాసినది కదా... థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.