శనివారం, మార్చి 04, 2017

పగలైతే దొరవేరా...

బంగారుపంజరం చిత్రంలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : జానకి

పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పక్కనా నువ్వుంటే
ప్రతిరాత్రి పున్నమి రా
పగలైతే దొరవేరా
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా
రేయైతే వెన్నెలగా బయలంత నిండేరా..
రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...

నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
నే కొలిచే దొరవైనా...నను వలచే నా రాజువే
కలకాలం ఈలాగే నిలిచే నీ దాననే
పక్కనా నీవుంటే..ప్రతిరాత్రి పున్నమి రా
ప్రతిరాత్రి..ఈ...ఈ.. పున్నమి రా...

పగలైతే దొరవేరా...
రాతిరి నా రాజువురా...
రాతిరి నా.... రాజువురా...

 

2 comments:

నైస్ సాంగ్..ఇందులో ఇంకో పాట కూడా చాలా బావుంటుంది.."గట్టు కాడ యెవరో"..

అవునండీ ఆ పాట కూడా బాగుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.