సోమవారం, మార్చి 27, 2017

నిను వినా నాకెవ్వరూ...

దేవుడు చేసిన బొమ్మలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుడు చేసిన బొమ్మలు (1976)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి 

నిను వినా నాకెవ్వరూ..
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..

కొలచినవారే కొరతలు బాపీ..
కోరిక తీర్చే దైవమునీవే
నిత్యము నిన్నే సేవించినచో..
నా కలలన్నీ సఫలము కావా
కలిమి బలిమి..నీ కరుణే..
 
నిను వినా నాకెవ్వరూ..
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ...

మోహనరూపం మురళీగానం..
నీ శుభనామం తారకమంత్రం
నీ కడగంటీ చూపులె చాలు..
తనువూ మనసూ పులకించేనూ
జపము తపము..నీకొరకే
 
నిను వినా నాకెవ్వరూ
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ

కన్నుల ఎదుటా కనపడు దైవం..
కరుణించుటయే స్త్రీసౌభాగ్యం
ఆరనిజ్యోతీ అమృతమూర్తీ..
దీవెనకాదా సుఖసంసారం
ఇల్లేస్వర్గం ఈ ఇలలో..
 
నిను వినా నాకెవ్వరూ..
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..
నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..

2 comments:

ఈ పాట ఈ సినిమాలోదా..చాలా చాలా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటండీ..బట్ ఈ మూవీ అని ఇంతవరకూ తెలీదు..

అవునండీ చాలా చక్కని పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.