మంగళవారం, మార్చి 28, 2017

చామంతి ఏమిటే ఈ వింత...

ఆత్మీయులు చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు
వరస కుదిరింది వలపు పెరిగింది

ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే

ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను

ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత

దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా

నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను

ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు
వరస కుదిరింది వలపు పెరిగింది
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల
గిలిగింత లేని పులకింత


2 comments:

ఇందులో పాటలన్నీ అద్భుతం గానే ఉంటాయి..

నిజమేనండీ... ఈ సినిమా మ్యూజికల్ హిట్ అనుకుంటా అప్పట్లో..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.