మూగమనసులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మూగ మనసులు (1963)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
మబ్బులు కమ్మిన ఆకాశం.. మనువులు కలసిన మనకోసం
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
చలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
నీ జతలో..చల్లదనం నీ ఒడిలో..వెచ్చదనం
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణంక్షణం కలవరించనా
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
ఎవరు పిలిచారనో..ఏమి చూడాలనో
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
ఉప్పొంగి ఉరికింది గోదావరీ..గోదావరి
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
చెలికాని సరసలో.. సరికొత్త వధువులో
తొలినాటి భావాలు తెలుసుకోవాలని
ఉప్పొంగి ఉరికింది గోదావరీ
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో.. ఓ..ఓ..
ఈనాటి ఈ బంధమేనాటిదో.. ఓ..ఓ..
2 comments:
భలే ఉందండీ ఈ పిక్..పాటకి తగ్గట్టుగా..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.